Encounter : జమ్మూలో ఎదురుకాల్పులు.. ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్ లోని కుల్గామ్ లో సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు

Encounter : జమ్మూలో ఎదురుకాల్పులు.. ఉగ్రవాది హతం

Encounter

Updated On : January 4, 2022 / 1:42 PM IST

Encounter : భారత సైన్యం ఉగ్రస్థావరాలను గుర్తించి మెరుపు దాడులకు దిగుతోంది. జమ్మూకశ్మీర్.. పోలీసులతో కలిసి ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి బలగారు. గత కొంతకాలంగా ఉగ్రవేట కొనసాగుతోంది. విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఉగ్రవాద స్థావరాలపై సైన్యం దాడులు చేస్తోంది సైన్యం. మంగళవారం కశ్మీర్ లోని కుల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది.

చదవండి : Srinagar Encounter : కశ్మీర్ లో ఎన్ కౌంటర్..లష్కర్ టాప్ కమాండర్ తో పాటు మరో ఉగ్రవాది హతం

దీంతో పోలీసులు బలగాలతో కలిసి కుల్గామ్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న బలగాలు ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది మృతి చెందినట్లుగా జమ్మూకశ్మీర్ పోలీస్ అధికారులు ఒకరు తెలిపారు. మరికొందరు పారిపోయినట్లు వివరించారు. ఇక మృతి చెందిన ఉగ్రవాది నుంచి పేలుడు పదార్థాలు, ఓ అత్యాధునిక వెపన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

చదవండి : Kashmir Encounter : కశ్మీర్ లో ఎన్ కౌంటర్..ఉగ్రవాది హతం