కరోనా భయంతో ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారని.. $ 1,000 డాలర్ల బోనస్ ప్రకటించిన Facebook

  • Published By: madhu ,Published On : March 18, 2020 / 04:04 AM IST
కరోనా భయంతో ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారని.. $ 1,000 డాలర్ల బోనస్ ప్రకటించిన Facebook

Updated On : March 18, 2020 / 4:04 AM IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సోషల్‌ మీడియా దిగ్గజం Facebook తన ఉద్యోగులకు వెయ్యి డాలర్లు బోనస్ ప్రకటించింది. కరోనా కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారని.. వారి శ్రమను గుర్తించి, ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఈ బోనస్‌ ఇస్తున్నట్లు ఫేస్‌బుక్‌ పేర్కొంది. ఉద్యోగులకు బోనస్‌ అందజేయనున్నట్లు మొదట తెలియజేసిన ఫేస్‌బుక్‌.. ఆ విషయాన్ని సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేరుతో ఉద్యోగులకు రాసిన అంతర్గత నోట్‌లో పూర్తి వివరాలు వెల్లడించింది.

సంస్థలో సుమారు 44 వేల 900 మంది పైగా కార్మికులను కలిగి ఉంది. ఇందులో శాశ్వత ఉద్యోగులు, మరికొన్ని వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా… కాంట్రాక్టు ఉద్యోగులకు బోనస్‌ అందుతుందా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. 

సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ కూడా తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని ట్విట్టర్ యాజమాన్యం వెల్లడించింది. ముప్పు పొంచి ఉన్నందున సంస్థ తరపున తమ బాధ్యతగా సమాజానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని, ఇది అసాధారణమైన నిర్ణయంగా సంస్థ HR Chief జెన్నీఫరస్ క్రిస్టీ తెలిపారు. 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వేలాది మంది చనిపోతున్నారు. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆర్థిక రంగం కుదేలయిపోయింది. 

Read More :కరోనా ముందు జాగ్రత్త : సెల్ఫ్ క్వారంటైన్‌లో దిలీప్ కుమార్, శిఖర్ ధావన్