Bappilahari : ఇవాళ బ‌ప్పీల‌హ‌రి అంత్యక్రియ‌లు

బ‌ప్పీల‌హ‌రి మృతికి అసలు కారణం అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే రుగ్మతగా వైద్యులు తేల్చారు. ఈ అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కారణంగా గుండె ఆగి ఆయన మృతి చెందినట్లు వెల్లడించారు.

Bappilahari : ఇవాళ బ‌ప్పీల‌హ‌రి అంత్యక్రియ‌లు

Bappilahari

Updated On : February 17, 2022 / 9:01 AM IST

Bappilahari Funeral : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బ‌ప్పీల‌హ‌రి అంత్యక్రియ‌లు ఇవాళ జ‌ర‌గ‌నున్నాయి. బ‌ప్పీల‌హ‌రి కుమారుడు అమెరికా నుంచి ఇండియా చేరుకున్నాడు. దీంతో ఇవాళ ఉదయం 10గంటలకు ముంబైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బ‌ప్పీల‌హ‌రి.. మృతికి అసలు కారణం అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే రుగ్మతగా వైద్యులు తేల్చారు. ఈ అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కారణంగా గుండె ఆగి బ‌ప్పీల‌హ‌రి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

డిస్కో కింగ్‌గా పేరు తెచ్చుకున్న బ‌ప్పీల‌హ‌రి అసలు పేరు అలోకేష్ ల‌హ‌రి. 1952 నవంబర్‌ 27న బెంగాల్‌లో జన్మించారు. బప్పీదా తండ్రి అపరేశ్‌ లహరి, తల్లి బనారసీ లహరి బెంగాల్‌లో ఫేమస్‌ సింగర్స్‌. దీంతో చిన్న వయసులో సంగీతాన్ని అవసాన పట్టేశారు బప్పీదా. మూడేళ్ల వ‌య‌సులోనే త‌బ‌లా నేర్చుకున్నారు. కిషోర్ కుమార్‌కు ఆయన దగ్గరి బంధువు. 19 ఏళ్ల వయసులోనే తన మ్యూజిక్‌ కెరీర్‌ను ప్రారంభించిన బప్పీలహరి..5 వేలకు పైగా పాటలను ట్యూన్‌ చేశారు. డిస్కో డ్యాన్సర్‌ హిందీ సినిమాతో సినీ అభిమానులను ఉర్రూతలూగించారు.

Obstructive Sleep Apnea: బప్పీలహరి ఈ జబ్బు కారణంగానే మృతి చెందారు, మీరు తెలుసుకోండి

1972లో బెంగాలీ చిత్రం దాదుతో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు బప్పీదా. అయితే ఆయన సంగీతాన్ని అందించిన మొదటి హిందీ చిత్రం 1973లో వచ్చిన నన్హా షికారి. ఆ తరువాత ఆయన ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా మారారు. బ‌ప్పీల‌హ‌రికి భార్య చిత్రాణి, కూతురు రీమా, కుమారుడు బప్ప లహరి ఉన్నారు.