టెన్షన్..టెన్షన్ : పశ్చిమ బెంగాల్ పోలింగ్ లో కాల్పులు
లోక్ సభ రెండో విడత పోలింగ్ లో భాగంగా పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రంలో టెన్షన్.. టెన్షన్. రాయ్ గంజ్, నార్త్ దినాజ్ పూర్ లో ఉద్రిక్తత నెలకొంది.

లోక్ సభ రెండో విడత పోలింగ్ లో భాగంగా పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రంలో టెన్షన్.. టెన్షన్. రాయ్ గంజ్, నార్త్ దినాజ్ పూర్ లో ఉద్రిక్తత నెలకొంది.
లోక్ సభ రెండో విడత పోలింగ్ లో భాగంగా పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రంలో టెన్షన్.. టెన్షన్. రాయ్ గంజ్, నార్త్ దినాజ్ పూర్ లో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంపై ఆందోళన కారులు రాళ్లు రువ్వటంతో కొంతసేపు పోలింగ్ ను అధికారులు నిలిపివేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పహారా కాస్తున్న పోలీసులపై ఆందోళన కారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు.
Also Read : జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్
పశ్చిమ బెంగాల్ లో మొదటి వితగా మూడు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మూడు స్థానాల్లోను 40మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో టీఎంసీ కార్యకర్తలు పోలింగ్ బూత్ క్యాప్చరింగ్ లకు పాల్పడుతున్నారనీ విమర్శలు వస్తున్నాయి. దీంతో పోలీసులు మరింత కట్టుదిట్టంగా ఆయా కేంద్రాల వద్ద కాపలా కాస్తున్న క్రమంలో ఆందోళన కారులు వారిపై రాళ్లు రువ్వటంతో ఓట్లు వేసేందుకు వస్తున్న ఓటర్లు తీవ్ర భయాందోళలకు గురవుతున్నారు.
గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా పలు అల్లర్లు జరగటంతో ముందస్తుగా సమస్యాత్మక కేంద్రాల్లో సీఆర్ పీఎఫ్ కేంద్రాలు భారీగా మోహరించాయి. ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు పిలుపునిస్తున్నారు.