Flipkart : డెలివరీ ఏజెంట్‌పై కస్టమర్ ఫిర్యాదు.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్

ఆన్ లైన్ షాపింగ్ సమయంలో డెలివరీ ఏజెంట్ల నుండి కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. తాజాగా ఓ డెలివరీ ఏజెంట్ కారణంగా ఓ సంస్థ కస్టమర్‌కి క్షమాపణలు చెప్పింది.

Flipkart : డెలివరీ ఏజెంట్‌పై కస్టమర్ ఫిర్యాదు.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్

Flipkart

Updated On : December 23, 2023 / 5:03 PM IST

Flipkart : ఇటీవల కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ కామన్ అయిపోయింది. ప్రతీది అందుబాటులో ఉండటంతో కస్టమర్లు దానిపై మొగ్గు చూపుతున్నారు. పైగా ఏది కావాలన్నా డైరెక్ట్‌గా ఇంటికే వస్తుండటంతో కస్టమర్లకు ఈజీ అయిపోయింది. అయితే డెలివరీ సమయంలో ఏజెంట్లతో కూడా కస్టమర్లకు సమస్యలు ఎదురవుతున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఏజెంట్ నుండి కస్టమర్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటనలో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌కి క్షమాపణలు చెప్పింది.

Viral Post : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కంపెనీ సీఎఫ్ఓ రాజీనామా లేఖ

@gharkakabutar ట్విట్టర్ యూజర్ అయిన ఓ మహిళ ఫ్లిప్‌కార్ట్ డెలివరీ సమయంలో తన తండ్రికి ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ నుండి డెలివరీ సమయంలో వన్ టైమ్ పాస్ వర్డ్ (OTP) కస్టమర్ అందించలేకపోవడంతో సమస్య తలెత్తింది. దాంతో కస్టమర్‌పై డెలివరీ ఏజెంట్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. దీనిపై ఆ మహిళ ‘నాన్న ఫ్లిప్‌కార్ట్ నుండి ఏదో ఆర్డర్ చేసారు.. ఆ సమయంలో తన ఫోన్ నుండి OTP చెప్పడంలో ఆలస్యమైంది. దాంతో డెలివరీ చేసిన వ్యక్తి కోపంగా “కుచ్ ఆతా నహీ హై తో ఆర్డర్ క్యూన్ కర్తే హో!” (మీకేమీ తెలియకపోతే వస్తువులను ఎందుకు ఆర్డర్ చేయాలి) అన్నాడు. మళ్లీ వారి నుండి ఏమీ ఆర్డర్ చేయవద్దు. మీరు కస్టమర్‌లతో మాట్లాడే విధానం ఇది కాదు’ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ పై చాలామంది స్పందించారు. డెలివరీ ఏజెంట్ల వల్ల తాము ఎదుర్కున్న ఇబ్బందులను చాలామంది షేర్ చేసుకున్నారు.

Ram Charan : మహారాష్ట్ర సీఎంతో రామ్ చరణ్ దంపతులు.. వైరల్ అవుతున్న ఫొటో..

ఈ ఘటనపై ఫ్లిప్ కార్ట్ స్పందించింది. ‘మేము ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నాము. మా ఏజెంట్ ప్రవర్తనకు చింతిస్తున్నాము. మీ Flipkart ఖాతా సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి DM ద్వారా మీ ఆర్డర్ వివరాలను షేర్ చేస్తే దీనిని వెంటనే పరిష్కరించగలుగుతాం’ అంటూ రిప్లై ఇచ్చింది. ఈ పోస్ట్‌పై చాలామంది ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు అందిస్తున్న సర్వీసు గురించి ముఖ్యంగా వృద్ధుల పట్ల గౌరవం లేకుండా ఉండటాన్ని విమర్శించారు.