ఈబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఢిల్లీ : ఈబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లతో సామాజిక స్ఫూర్తి దెబ్బతింటుందని జస్టిస్ ఈశ్వరయ్య పిటిషన్ లో పేర్కొన్నారు. ఎలాంటి అధ్యయనం, జనాభా దామాషా లేకుండా రిజర్వేషన్లు కల్పించారని పిటిషన్ లో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లకు కల్పించింది. రిజర్వేషన్ల బిల్లుకు లోక్ సభ, రాజ్యసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈబీసీ రిజ్వరేషన్లను కొన్ని కుల సంఘాలు వ్యతిరేకించాయి. ఆందోళన, పోరాటాలు చేస్తున్నాయి. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పుబడుతున్నాయి.