Shakuntala Choudhary: శకుంతలా చౌదరి కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం!

గాంధేయ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు శకుంతలా చౌదరి(102) కన్నుమూశారు.

Shakuntala Choudhary: శకుంతలా చౌదరి కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం!

Shakuntala Choudhary

Updated On : February 21, 2022 / 11:10 AM IST

Shakuntala Choudhary: గాంధేయ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు శకుంతలా చౌదరి(102) కన్నుమూశారు. అస్సాంలోని కామ్రూప్‌కు చెందిన ఆమె గ్రామాల్లోని ప్రజల సంక్షేమం కోసం.. ముఖ్యంగా మహిళలు, పిల్లల కోసం పని చేశారు. ‘శకుంతల బైడియో’గా ప్రసిద్ధి చెందారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.

ప్రధాని మోదీ సంతాపం:
శకుంతలా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. గాంధేయ విలువలను పెంపొందించేందుకు శకుంతలా చౌదరి జీవితాంతం కృషి చేశారని, ఆ విధంగా ఆమె ఎప్పటికీ గుర్తుండిపోతారని అభిప్రాయపడ్డారు మోదీ. సరనియా ఆశ్రమం ద్వారా ఆమె చేసిన గొప్ప పనులు చాలా మంది జీవితాలను ప్రభావితం చేసింది. ఆమె మరణించడం బాధాకరం అన్నారాయన.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 సంవత్సరానికి పద్మ అవార్డులను ప్రకటించగా.. పద్మ అవార్డుతో సత్కరించబడిన ఈశాన్య ప్రాంతానికి చెందిన నలుగురు మహిళల్లో శకుంతలా చౌదరి ఒకరు. శకుంతలా చౌదరి అస్సాంకు చెందినవారు. శకుంతలా చౌదరిని ఆ ప్రాంత ప్రజలు ‘శకుంతలా బాయి దేవ్’ అని పిలిచేవారు.

పద్మశ్రీ శకుంతల చౌదరి ఎవరు?
శకుంతలా చౌదరి గౌహతిలోని ఉలుబరిలోని కస్తూర్బా ఆశ్రమంలో పర్యవేక్షకురాలుగా ఉండేది. శకుంతల చౌదరి హాండిక్ బాలికల కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థిని. శకుంతలా చౌదరి తన 100వ పుట్టినరోజును కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అస్సాం బ్రాంచ్‌లో కాలేజీ విద్యార్థులతో కలిసి జరుపుకుంది. ఒక నివేదిక ప్రకారం, శకుంతలా చౌదరి అస్సాంలో 100 సంవత్సరాలు దాటిన ఏకైక మహిళ. సామాజిక కార్యకర్త శకుంతలా దేవి మహాత్మా గాంధీ ఆలోచనలు, సూత్రాలను ముందుకు తీసుకెళ్లారు.