జయలలిత ఆస్తులపై కోర్టు సంచలన తీర్పు.. పోయెస్ గార్డెన్, 11,000 చీరలు.. అంతా ఎవరికంటే..

ఆ ఆస్తులు కోట్లాది రూపాయల విలువచేస్తాయి.

జయలలిత ఆస్తులపై కోర్టు సంచలన తీర్పు.. పోయెస్ గార్డెన్, 11,000 చీరలు.. అంతా ఎవరికంటే..

Updated On : January 30, 2025 / 6:43 PM IST

Jayalalithaa: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలితకు చెందిన పలు ఆస్తులపై బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2004 ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న వాటిని తమిళనాడు ప్రభుత్వానికి ఇచ్చేయాలని అధికారులను ఆదేశించింది.

ఆ ఆస్తులు కోట్లాది రూపాయల విలువచేస్తాయి. ఆ ఆస్తుల్లో చెన్నైలోని పోయెస్ గార్డెన్ నివాసం, బ్యాంకు డిపాజిట్లు, 700 కిలోల వెండి ఆభరణాలతో పాటు బంగారం, వజ్రం, ముత్యాలు, ఇతర విలువైన ఆభరణాలు ఉన్నాయి. అలాగే, 11,000కు పైగా చీరలు, 44 ఎయిర్ కండిషనర్లు, 750 ప్రత్యేక చెప్పులు, అనేక ఇతర వస్తువులు ఉన్నాయి.

ఫిబ్రవరి 14-15లోపు ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఈ మేరకు జడ్జి హెచ్‌ఏ మోహన్‌ ఆదేశాలు ఇచ్చారు. కాగా, జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఆమె 2016లో కన్నుమూశారు. అనంతరం ఆ ఆ కేసు విచారణను కోర్టు నిలిపివేసింది. జయలలిత ఆస్తుల జప్తును సుప్రీంకోర్టు అప్పట్లో సమర్థించింది.

జప్తు చేసిన ఆస్తులను ఇచ్చేయాలంటూ జయలలిత మేనల్లుడు, మేనకోడలు జె.దీపక్, జె.దీపా వేసిన పిటిషన్లను జనవరి 13న కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రత్యేక సీబీఐ కోర్టు తాజాగా వీటిపై ఈ ఆదేశాలిచ్చింది.

ఇందులో చైనా ఫస్ట్‌.. భారత్‌ సెకండ్‌.. మోదీ లక్ష్యాన్ని నెరవేర్చుతాం: విశాఖలో కుమారస్వామి