పోలీసులకు వింత ఫిర్యాదు : అమ్మానాన్నలు మమ్మల్ని ప్రేమించట్లేదు

మా అమ్మానాన్నలు మమ్మల్ని సరిగా చూసుకోవటంలేదు అంటు పోలీస్ స్టేషన్ కు ఓ విచిత్రమైన కంప్లైంట్ వచ్చింది. మా తమ్ముడ్ని తప్ప మమ్మల్ని మా అమ్మానాన్నలు పట్టించుకోవటంలేదనీ..ఏం చేసినా తిడుతున్నారనీ..కొడుతున్నారనీ..ఇద్దరు అన్నా చెల్లెళ్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. ఆ అన్నా చెల్లెలు ఏమీ చిన్నపిల్లలు కాదు డిగ్నీ చదువుతున్నారు.వారి ఇచ్చిన ఫిర్యాదు విని అయోమయంలో పడ్డారు పోలీసులు. ఈ ఘటన యూపీలోని గజియాబాద్ పట్టణంలో సిహానీగేట్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.
ఈ పీఎస్ పరిధి తరచూ అత్యంత నేరపూరతమైన కేసులు నమోదవుతుంటాయి. వీటిని ఫుల్ డిఫరెంట్ ఇటువంటి విచిత్ర కంప్లైంట్ వచ్చేసరికి పోలీసులు కంగుతిన్నారు. ఈ కంప్లైంట్ పై పోలీస్‌స్టేషన్ హెడ్ ఉమేష్ బహాదూర్ మాట్లాడుతూ…తల్లిదండ్రులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కేవలం తమ తమ్ముడిని మాత్రమే బాగా చూసుకుంటూ..తమ ఇద్దరినీ అస్సలు పట్టించుకోవటంలేదంటూ కంప్లైంట్ చేశారని చెప్పారు.
మా అమ్మానాన్నలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారనీ తెలిపారు. కంప్లైంట్క చేసి ఆఇద్దరు అన్నా చెల్లెళ్లు అన్న బీఎస్సీ, చెల్లెలు బీకాం చదువుతున్నారు. వారి తండ్రి వ్యాపారి అని, వారికి ఒక తమ్ముడు ఉన్నాడని..అమ్మానాన్నలిద్దరు తమ్ముడ్ని బాగు చూసుకుంటూ..తామిద్దరూ.. ఏం మాట్లాడినా కొడుతున్నారని తెలిపారు. ఆఖరికి తమ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినా తిడుతున్నారనీ..దీంతో తమ ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా తమతో మాట్లాడటంలేదని వారి కంప్లైంట్ చేశారని ఉమేష్ తెలిపారు. ఈ కేసు విషయంలో ఏం చేయాలో తెలీని పోలీసులు ఆ అన్నాచెల్లెళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించివేశారు. వారి తల్లిండ్రులను కూడా పిలిపించి..మాట్లాడతామని తెలిపారు.
కాగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల మధ్య ఇటువంటి బేధాలు తలెత్తే అవకాశాలుఉంటాయి. కొన్ని సందర్బాలలో ఆ బేధాలు విభేదాలు దారి తీసి నేరాలకు పాల్పడే అవకాశాలు కూడా లేకపోలేదు.