Today Gold Price : శుభవార్త.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
బంగారం ధర గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతుంది. వెండి ధర భారీగా పడిపోయింది. దేశంలో వెండిధర తగ్గితే గ్లోబల్ మార్కెట్లో మాత్రం వెండి ధర పెరిగింది.

Today Gold Price
Today Gold Price : బంగారం ధర గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతుంది. వెండి ధర భారీగా పడిపోయింది. దేశంలో వెండిధర తగ్గితే గ్లోబల్ మార్కెట్లో మాత్రం వెండి ధర పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం (Gold) ధర రూ.48,830 వద్దనే కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.44,760 వద్ద నిలకడగా ఉంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండటం కొనుగోలు దారులకు శుభవార్తే అని చెప్పవచ్చు.
చదవండి : Today Gold Price : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా
ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 10 గ్రాముల(22, 24 క్యారెట్లు) బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే..
ఢిల్లీ 22 క్యారెట్లు బంగారం 46,910, 24 క్యారెట్లు 51,170
ముంబై 22 క్యారెట్లు 46,820, 24 క్యారెట్లు రూ.47,820
చెన్నై 22 క్యారెట్లు రూ. 45,000, 24 క్యారెట్లు రూ.49,100
కోల్‌కతాలో 22 క్యారెట్లు రూ.47,100, 24 క్యారెట్లు రూ.49,800
బెంగళూరులో 22 క్యారెట్లు రూ.44,760 ఉండగా, 24 క్యారెట్లు రూ.48,830 ఉంది.
తిరువనంతపురం 22 క్యారెట్లు రూ.44,760 ఉండగా, 24 క్యారెట్లు రూ.48,830.
చదవండి : Today Gold Price : పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్లు రూ.44,760, 24 క్యారెట్లు రూ.48,830.
విజయవాడలో 22 క్యారెట్లు రూ.44,760 ఉండగా, 24 క్యారెట్లు రూ.48,830.
విశాఖలో 22 క్యారెట్లు రూ.44,760, 24 క్యారెట్ల రూ.48,830.
ఇక వెండి విషయానికి వేస్తె.. బుధవారం వెండి ధర తగ్గింది. కేజీ బంగారంపై కొన్ని నగరాల్లో రూ. 300 తగ్గితే.. మరికొన్ని చోట్ల రూ.600 తగ్గింది.