అందుబాటులోకి జియో ఫెన్సింగ్.. కుటుంబ వివరాలన్నీ ఒకే చోట

అందుబాటులోకి జియో ఫెన్సింగ్.. కుటుంబ వివరాలన్నీ ఒకే చోట

Updated On : November 8, 2019 / 5:51 AM IST

పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ ద్వారా వెతికేస్తున్నారు. సహజంగానే అందరికీ ఊరు నమూనా తెలుసు కాబట్టి తేలికగా మీ ఇల్లు ఎక్కడుందో తెలిసిపోతుంది. కాని ప్రభుత్వాలు మీ ఇంటి సమాచారం తెలుసుకోవాలంటే చాలా కష్టపడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్ధితిని గుర్తించి విన్నూత ఆలోచనతో ముందుకొచ్చింది. ప్రతి ఇంటిని ‘జియో ఫెన్సింగ్ ’ టెక్నాలజీతో అనుసంధానం చేయాలని భావించింది. 

ఈ టెక్నాలజీతో  కేంద్ర ఎన్నికల సంఘం ‘నజరీ నక్షా’తో ప్రతి ఇంటిని నమూనాను గుర్తించడంతో పాటు, ఉపగ్రహ ఛాయ చిత్రాలను కూడా ఉపయోగిస్తుంది. పోలింగ్ సేష్టన్ నివసించే వారిని వివరాలను తేలికగా ఆ సేష్టన్‌లో ఉంచటానికి ప్రయత్నిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల్లలో ఉండటం వల్ల గందరగోళంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించటానికి ఈసీ నజరీ నక్షా ద్వారా ఇప్పటికే ఎన్నికల సంఘం 31,76,699 ఇళ్ల ఆకారాలను గుర్తించింది.

దీనికి అనుగుణంగా రెవెన్యూ శాఖ ఇళ్లకు జియో రిఫరన్స్ ప్రక్రియను చేస్తోంది. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. ఈ టెక్నాలజీ ఓటర్ల వివరాలకే కాకుండా ప్రజావసరాలకు ఉపయోగించాలని లేఖలో రాశారు. ఈ టెక్నాలజీ రేషన్  పంపిణీలోనూ ఉపయోగపడుతుంది. గ్రామాల్లో వార్డుల విభజనకు, క్లస్టర్లను తయారీలో ఉపయోగపడుతుంది. 

పట్టణ ప్రాంతాల్లో ఈ టెక్నాలజీ ని అనుకున్నంత తేలిక కాదు అనిపిస్తోంది. నగరాల్లో నివసించేవారు తరచుగా చిరునామా మారే అవకాశం ఎక్కువగా ఉంది. మారిన ప్రతిసారి ఈ వ్యవస్థను అప్ డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ జియో ఫెన్సింగ్ ద్వారా ప్రజావసరాలను ,అభివృద్ధి కార్యకలాపాలను తేలికగా చేయవచ్చని చెబుతున్నారు.