Wedding : పెళ్లి బరాత్ లో కిందపడ్డ వరుడు

వరుడికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే బరాత్ వేడుకను వీడియో తీసిన కొందరు వరుడు కిందపడిన క్లిప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Wedding : పెళ్లి బరాత్ లో కిందపడ్డ వరుడు

Wedding

Updated On : June 20, 2021 / 3:16 PM IST

Wedding : పెళ్లి వేడుకలో బరాత్ లో ఉండే సందడి మరెక్కడ కనిపించదు. చాలామంది బారాత్ లో పాల్గొనేందుకే వస్తుంటారు. ఈ బరాత్ వేడుకకు వరుడి స్నేహితులు ముందుంటారు. డీజే డాన్సులకు చిందులేస్తూ బారాత్ ను హోరెత్తిస్తారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఈ వేడుకలో ప్రమాదాలు జరుగుతుంటాయి.

బరాత్ లో పొరపాట్లు జరిగి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా జరిగిన ఓ బరాత్ వేడుకలో ఓ వ్యక్తి వరుడిని భుజాలపై ఎత్తుకొని డాన్స్ చేస్తున్నాడు. ఇదే సమయంలో వరుడు బ్యాలెన్స్ తప్పడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో చుట్టూవున్న వారు వెంటనే వచ్చి వరుడిని పైకి లేపారు.

వరుడికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే బరాత్ వేడుకను వీడియో తీసిన కొందరు వరుడు కిందపడిన క్లిప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87)