గుజరాత్, పంజాబ్ లో హై అలర్ట్

  • Published By: vamsi ,Published On : February 26, 2019 / 07:14 AM IST
గుజరాత్, పంజాబ్ లో హై అలర్ట్

Updated On : February 26, 2019 / 7:14 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌ లోనూ, పంజాబ్ రాష్ట్రంలోనూ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని జైషేలో భారత వాయుసేన దాడులు చేసిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతంలోని జిల్లాలలో పోలీసులు, భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన గుజరాత్ డీజీపీ సమావేశాన్ని రద్దు చేశారు.

పంజాబ్ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లోని భద్రతా బలగాలను మోహరించారు. నిఘా వర్గాలు హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు.. అదనపు బలగాలను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీని టైట్ చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న అధికారులు అనుమానం వచ్చిన వారిని విచారిస్తున్నారు. ఎయిర్ పోర్టు, రైల్వే , బస్ స్టేషన్‌లలో నిఘా పెంచారు.