లైంగిక దాడి ఘటనలు జరుగకూడదు…నిరసన ర్యాలీలో ఢిల్లీ సీఎం

  • Published By: venkaiahnaidu ,Published On : October 2, 2020 / 09:09 PM IST
లైంగిక దాడి ఘటనలు జరుగకూడదు…నిరసన ర్యాలీలో ఢిల్లీ సీఎం

Updated On : October 2, 2020 / 9:56 PM IST

Hathras case: Delhi CM joins protest ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో బాధితురాలికి న్యాయం జరుగాలంటూ ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆప్, భీమ్ ఆర్మీ, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు.

నిందితులను కఠినంగా శిక్షించాలని దేశమంతా కోరుతున్నదని కేజ్రీవాల్ అన్నారు. నిందితులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు అనుమానిస్తున్నారని చెప్పారు. ఈ సమయంలో బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందాలని ఆయన అన్నారు.



ఈ సందర్భంగా కేజ్రీవాల్… ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ముంబై లేదా ఢిల్లీలో మహిళలపై లైంగిక దాడి ఘటనలు ఎందుకు జరుగాలని ప్రశ్నించారు. ఈ అంశంలో ఎలాంటి రాజకీయాలు వద్దని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీపీఐ నేత డీ రాజా, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.