ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Updated On : January 24, 2021 / 7:29 PM IST

Heavy drug seize at Delhi airport : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. 9.8 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. డ్రగ్స్‌కు సంబంధించి ఇద్దరు ఉగాండా వాసులను అరెస్ట్‌ చేసి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడటం కలకలం రేపుతోంది.

డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎన్నాళ్ల నుంచి సరఫరా చేస్తున్నారు? ఎవరిని టార్గెట్ చేసి తీసుకెళ్తున్నారు? అనే విషయాలపై అధికారులు కూపీ లాగుతున్నారు. ఎవరికీ దొరకుండా ఉండే విధంగా ప్యాక్ చేసి డ్రగ్స్ తరలిస్తున్నారు.

కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. వారి దగ్గర నుంచి భారీగా హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎయిర్ పోర్టు వరకు డ్రగ్స్ ఎలా తీసుకురాగలిగారన్నది ప్రశ్నార్థకంగా మారింది.