హైకోర్టు విభజన : పిటీషన్ కొట్టివేసిన సుప్రీం

ఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై దాఖలైన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. జనవరి 1వ తేదీ నుండే ఇరు రాష్ట్రాల హైకోర్టులో పనిచేయడం ప్రారంభించాయి. ఇప్పటికే రెండు హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే…అమరావతిలో కడుతున్న హైకోర్టు అసమగ్రంగానే ఉందని..సరైన మౌలిక వసతులు లేవని..అప్పటి వరకు విభజన వాయిదా వేయాలంటూ ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై 2019, జనవరి 2వ తేదీ సుప్రీం విచారణ చేపట్టింది. పిటిషనర్ల వాదనలతో జస్టిస్ ఎ.కె.సిక్రీ, అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఏకీభవించలేదు.
జోక్యం చేసుకోం..సుప్రీం
చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న అంశమని..చాలా దఫాలుగా విచారించడం జరిగిందని పేర్కొంది. చిన్న చిన్న సమస్యలు సర్వసాధరణమేనని…ఈ విషయంలో జోక్యం చేసుకోవడం జరగదని తెలిపింది. హైకోర్టు అమరావతిలో ఏర్పాటు కావడం పట్ల ఆంధ్రలో ప్రాక్టిస్ చేస్తున్న వారు సంతోషం వ్యక్తం చేస్తూ…దీనిని అడ్డుకోవడం సరికాదంటూ లెటర్ చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా హైకోర్టులు కార్యకలాపాలు సాగించబోతున్నాయి.