Tamil Nadu : ఘోర ప్రమాదం.. గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టిన బైక్.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

Tamil Nadu Accident : ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. బైక్ ను బలంగా ఢీకొట్టింది.

Tamil Nadu : ఘోర ప్రమాదం.. గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టిన బైక్.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

Tamil Nadu Accident (Photo : Google)

Updated On : June 25, 2023 / 11:29 PM IST

Tamil Nadu Accident : అతివేగం అత్యంత ప్రమాదకరం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఇది అనేకసార్లు రుజువైంది. రోడ్డు మీద వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, వేగంగా వెళ్లకూడదని పోలీసులు చెబుతూనే ఉన్నారు. అతి వేగం, నిర్లక్ష్యం కారణంగా ఎన్ని ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయో కళ్లారా చూస్తున్నాం. అయినా, కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రాణాలను కోల్పోతున్నారు.

కొన్ని సందర్భాల్లో కొందరి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఏది ఏమైనా.. ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ మంచిది కాదు. తాజాగా తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రమాదం ఎంతో భయంకరంగా ఉంది. ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది.

Also Read..New Car Buying Guide : కొత్త కారు కొంటున్నారా? కొనే ముందు ఈ 5 విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి..!

కోయంబత్తూరులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. బైక్ ను బలంగా ఢీకొట్టింది. దాంతో బైక్ గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. అదే వేగంతో వెనుకగా వస్తున్న టెంపోపై బైక్ పడింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్ర గాయాలతో స్పాట్ లోనే చనిపోయాడు.

అంబరంపాళయం గాంధీనగర్ ప్రాంతానికి చెందిన జాకీర్ హుస్సేన్ (36) తన కొడుకు అజ్మల్ ను కబడ్డీ కోచింగ్ కు బైక్ పై తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా అతి వేగంగా ఓ కారు దూసుకొచ్చింది. ముందు వెళ్తున్న వాహనాన్ని కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా ఓవర్‌ టేక్‌ చేయబోయి ఘోర ప్రమాదానికి కారణమయ్యాడు. ఎదురుగా వచ్చిన బైక్ ను కారుతో బలంగా డ్యాష్ ఇచ్చాడు. ఆ ధాటికి బైక్ గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. ఈ యాక్సిడెంట్ లో తండ్రి స్పాట్ లోనే చనిపోగా, కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.