PM Modi: మోదీని రాష్ట్రపతి ఎప్పుడవుతారని ప్రశ్నించిన చిన్నారి
ప్రధాని నరేంద్ర మోదీని కలవడం, పార్లమెంటుకు వెళ్లడం కలగా భావించిన పదేళ్ల బాలికకు బుధవారం నిజమై షాక్ ఇచ్చింది. అహ్మద్‌నగర్ ఎంపీ డా. సుజయ్ విఖే పాటిల్, మహారాష్ట్ర లీడర్ రాధాకృష్ణ విఖే పాటిల్ మనువరాలు అయిన అనీషాకు ప్రధాని పది నిమిషాల అపాయింట్మెంట్ ఇచ్చారు.

Pm Modi 10 Yrs Kid
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీని కలవడం, పార్లమెంటుకు వెళ్లడం కలగా భావించిన పదేళ్ల బాలికకు బుధవారం నిజమై షాక్ ఇచ్చింది.
అహ్మద్‌నగర్ ఎంపీ డా. సుజయ్ విఖే పాటిల్, మహారాష్ట్ర లీడర్ రాధాకృష్ణ విఖే పాటిల్ మనువరాలు అయిన అనీషాకు ప్రధాని పది నిమిషాల అపాయింట్మెంట్ ఇచ్చారు. పీఎం మోదీని కలవాలని ఉందని పలు మార్లు తండ్రిని అడిగినప్పటికీ వీలుకాలేదు. ప్రధాని చాలా బిజీ వ్యక్తి అని అందరినీ కలవడం కుదరదని, అసాధ్యమైన కోరికలు వద్దంటూ బుజ్జగించేవారు.
ఎలాగైనా ప్రధానిని కలవాలనే పట్టుదలతో తండ్రి ల్యాప్‌టాప్ నుంచి పీఎంకు మెయిల్ చేసింది. అందులో.. ‘హలో సార్, నేను అనీషా. నాకు మిమ్మల్ని కలవాలని ఉంది’ అని రాసింది. ఆ చిన్నారి కామెంట్ కు రిప్లై కూడా వచ్చింది ‘పరిగెత్తుకుంటూ వచ్చేయ్ నాన్నా..’ అని అందులో ఉంది.
పార్లమెంట్‌కు విఖే పాటిల్ రాగానే ప్రధాని మోదీ తొలి ప్రశ్న.. అనీశా ఎక్కడ? అని.
అంతే ప్రధాని ఆఫీస్ లో కలిసేందుకు వెళ్లిన అనీశా.. ప్రశ్నలు అడుగుతూనే ఉంది. ఇదేనా మీ ఆఫీస్. ఇంత పెద్దగా ఉంటుందా.. రోజంతా ఇక్కడే కూర్చొంటారా.. అంటూ ఉన్నంతసేపు ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది.
చిన్నారులతో గడపడాన్ని ఇష్టంగా భావించే ప్రధాని సహనంతో ప్రశ్నలకు సమాధానాలిస్తూనే ఉన్నారు. ఇవాళ నిన్ను కలవడానికే ఇక్కడ ఉన్నాను. నీతో మాట్లాడాలనుకున్నాను. అంటూ ఆమెకు బదులిచా్చారు.
మీరు గుజరాత్ నుంచి వచ్చారు కదా.. మరి రాష్ట్రపతి ఎప్పుడు అవుతారని అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ నవ్వును బదులిచ్చారు.