Stop wasting FOOD : ‘మీ పెళ్లిలో ఫోటోగ్రాఫర్ మిస్ చేసిన ఫోటో ఇదే ’: IAS షేర్ చేసిన పోస్ట్ వైరల్
‘మీ పెళ్లిలో ఫోటోగ్రాఫర్ మిస్ చేసిన ఫోటో ఇదే ’అంటూ IAS అవనీశ్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. దీనిపై ప్రతీ ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉందనే సందేశం ఈ ఫోటోలో ఉంది.

Stop Wasting Food..ias Awanish Sharing Photo
Stop wasting FOOD..IAS Awanish Sharing Photo : పెళ్లిళ్లలో ఆహారం వృధా అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఆహారంలో దాదాపు 40 శాతంకంటే ఎక్కువ వ్యర్థమవుతోందని లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు ప్రపంచ జనాభాలో 10 శాతం మంది పస్తులుంటున్నారు. ఓ పక్క వృధా..మరోపక్క గుప్పెడు మెతుకుల కోసం నానా పాట్లు పడుతున్న దుస్థితి. ఈ ఆహార వృధా ఆహార భద్రత ప్రమాదాన్ని పెంచుతోంది. కానీ ఇవేవీపట్టవు. వివాహాలు..పలు శుభకార్యాల్లో ఆహారం చాలా చాలా వృధా అవుతోంది. తినగలిగినంత మాత్రమే ప్లేట్లో పెట్టుకోకుండా ఎక్కువగా పెట్టుకోవటం పారేయటం సాధారణంగా మారిపోయింది.అదేమంటే విందులో అందుబాటులో ఉన్నవన్నీ టేస్ట్ చేయాలి కదా..కానీ పెట్టుకున్నంతా తినగలమా? లేదా? అనే ఆలోచనే లేదు.
Also read : ఒక వ్యక్తి ఏడాదికి 50కేజీల ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నారట: అధ్యయనం
ప్లేట్‌లో పెట్టుకున్నంత అన్నం తినరు చాలామంది. అన్నంతో పాటు కూరలు, పిండివంటలు ఇంకా ఇతర ఆహార పదార్ధాలు పారేస్తుంటారు. అలా ఎంతో ఆహారం వృధా అయిపోతోంది. ఇది కేవలం పెళ్లిళ్లలోనే జరిగేది కాదు.. ప్రతి విందు కార్యక్రమాల్లోనూ జరిగేదే. ఆహారాన్ని వేస్ట్ చేయొద్దు అని ఎంతగా చెప్పినా..వినరు. ప్లేట్ నిండా పెట్టుకుంటారు.. అందులో సగం కూడా తినకుండానే పారేస్తుంటారు. వండిన దాంట్లో సగం ఇలా వేస్టేజ్ కింద పోయేదే.
ఓ వివాహంలో జరిగిన ఆహారం వృధా గురించి ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరణ్ ఓ పెళ్లిలో వేస్ట్ అయిన ఫుడ్ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. మీ పెళ్లిలో ఫోటోగ్రఫర్ మిస్ చేసే ఫోటో ఇదే. ఆహారాన్ని వృథా చేయడం ఆపండి.. అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు.
Also read : World Food Day : ప్రపంచ ఆహార దినోత్సవం..ప్రధాన లక్ష్యం ఇదే..పాటించాల్సిన బాధ్యత అందరిదీ..
The photo that your wedding photographer missed.
Stop wasting FOOD. pic.twitter.com/kKx9Mxadpp
— Awanish Sharan (@AwanishSharan) February 18, 2022
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పెద్ద చర్చే జరుగుతోంది. ఆహారాన్ని ఇలా వృధా చేయటం సరైందికాదని నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రజల్లో ఆహారం వృథా గురించి సరైన అవగాహన లేదు. ప్రతి రోజు 20 కోట్ల మంది భారతీయులు ఆహారం దొరక్క ఖాళీ కడుపుతో ఉంటున్నారు. అందుకే ఆహారాన్ని ఇకనైనా వృథా చేయకండి.. అంటూ ఐఏఎస్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఇటువంటి విషయాల్లో కేవలం సపోర్ట్ చేయటం ఒక్కటే కాదు పాటించటం చాలా చాలా అవసరం అనే విషయం ప్రతీ ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి…
కాగా..అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రజల ఆకలి తీర్చటమే ఈ రోజు లక్ష్యం. కరోనా కంటే క్యాన్సర్ మహమ్మారులకంటే అత్యంత భయంకరమైన దారుణమైనదీ ఆకలి తీర్చే లక్ష్యంగా..ఈ రోజు ఏర్పడింది.ప్రపంచ ఆకలి తీర్చడమే వరల్డ్ ఫుడ్ డే ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలు ఈ ‘వరల్డ్ ఫుడ్ డే’కార్యక్రమంలో పాల్గొంటాయి. అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అంటూ ప్రతీ ఏడాది లాగానే 2021లో‘‘ఆరోగ్యకరమైన రేపటి కోసం ఇప్పుడు సురక్షితమైన ఆహారం” అనే థీమ్‌ను నిర్ణయించారు. ఆహారాన్ని ఆదా చేయడం, ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని పెంచడం అనేది ఈ రోజు ప్రధాన లక్ష్యం. భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహారలోప సమస్యను నిర్మూలించాలనేది కూడా ఈ వరల్డ్ ఫుడ్ డే ప్రధాన ఉద్దేశం.