Covid Vaccine: వ్యాక్సిన్ రెడీ అవకపోతే మేం ఉరేసుకోవాలా… – మంత్రి

కోర్టు చెప్పినట్లుగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయలేకపోతే ఉరేసుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు కేంద్ర మంత్రి సదానంద్ గౌడ. 'కోర్టు మంచి ఉద్దేశంతోనే దేశంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని చెప్పింది. నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ..

Covid Vaccine: వ్యాక్సిన్ రెడీ అవకపోతే మేం ఉరేసుకోవాలా… – మంత్రి

Covid Vaccine

Updated On : May 13, 2021 / 9:07 PM IST

Covid Vaccine: కోర్టు చెప్పినట్లుగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయలేకపోతే ఉరేసుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు కేంద్ర మంత్రి సదానంద్ గౌడ. ‘కోర్టు మంచి ఉద్దేశంతోనే దేశంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని చెప్పింది. నేను ఒకటి అడగాలనుకుంటున్నా. రేపటి కల్లా ఇంత మొత్తంలో వ్యాక్సిన్ కావాలని కోర్టు చెబితే.. అప్పటి వరకూ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ అవకపోతే మేం ఉరేసుకోవాలా అని అడుగుతున్నారు గౌడ.

వ్యాక్సిన్ కొరతపై వస్తున్న ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ప్రభుత్వ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను, తీసుకున్న నిర్ణయాలను ఎటువంటి రాజకీయ లాభం గురించి మరే కారణంతో కాదని చెప్పారు. ప్రభుత్వం తన డ్యూటీని సిన్సియర్ గా, నిజాయతీగా పూర్తి చేస్తుంది.

ప్రాక్టికల్ గా ఇటువంటి విషయాలు అదుపులో ఉండవు. వాటిని ఎలా మేనేజ్ చేయగలం అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన ప్రభుత్వ నిర్ణయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో రెండ్రోజుల్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు.

మంత్రి గౌడతో పాటుగా ఉన్న బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ సీటీ రవి మాట్లాడుతూ సరైన సమయానికి ఏర్పాట్లు చేయకపోతే మరింత దారుణాలను చూడాల్సి వస్తుందన్నారు. ఆక్సిజన్ సప్లైను 300మెట్రిక్ టన్నుల నుంచి 1500టన్నులకు పెంచినట్లు ఆయన చెప్పారు. కరోనావైరస్ ఊహించనంత స్థాయిలో పెరిగే సరికి మా అంచనాలు తప్పాయని అన్నారు.