అలా చేస్తే కరోనా థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవచ్చు

దేశంలో కరోనా థర్డ్ వచ్చే అవకాశముందని,అయితే అది ఎప్పుడు..ఎలా వస్తుందో చెప్పలేమంటూ రెండు రోజుల క్రితం

అలా చేస్తే కరోనా థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవచ్చు

If We Take Strong Measures Third Wave Of Covid 19 May Not Happen Governmen

Updated On : May 7, 2021 / 10:01 PM IST

K VijayRaghavan దేశంలో కరోనా థర్డ్ వచ్చే అవకాశముందని,అయితే అది ఎప్పుడు..ఎలా వస్తుందో చెప్పలేమంటూ రెండు రోజుల క్రితం కేంద్ర ప్ర‌భుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కే విజ‌య్‌రాఘ‌వ‌న్‌ చెప్పిన విషయం తెలిసిందే. అయితే క‌ఠిన‌మైన‌ చ‌ర్య‌లు తీసుకోవడం వ‌ల్ల క‌రోనా థ‌ర్డ్ వేవ్ రాకుండా అడ్డుకోగ‌ల‌మ‌ని కే విజ‌య్‌ రాఘ‌వ‌న్‌ శుక్రవారం వ్యాఖ్యానించారు.

పటిష్ఠ చర్యలు చేపడితే కొన్ని ప్రాంతాల్లో.. వీలైతే అన్ని ప్రాంతాల్లో థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉండదని విజ‌య్‌ రాఘ‌వ‌న్‌ అన్నారు. అయితే అది స్థానికంగా అంటే రాష్ట్రాలు, జిల్లాలు, న‌గ‌రాలు, ప‌ల్లెల్లో కరోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఎంత స‌మర్థంగా అమలు చేస్తున్నార‌న్న‌దానిపై ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు.

ఇక,కరోనా నుంచి కోలుకున్న వాళ్ల‌లో బ్లాక్ ఫంగ‌స్ లేదా మ్యూకోర్మిసిస్ వ‌స్తుంద‌న్న వార్త‌ల‌పై స్పందిస్తూ..దీనిని తాము జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇక నీళ్ల ద్వారా క‌రోనా వ్యాపించ‌ద‌ని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.