IIT-Bombay : అఫ్ఘాన్‌ విద్యార్థులు క్యాంపస్‌ హాస్టల్‌లో ఉండచ్చు..

అఫ్ఘాన్ విద్యార్థులకు ఐఐటీ బాంబే శుభవార్త చెప్పింది. ఐఐటీ బాంబే విద్యార్థులు క్యాంపస్ హాస్టల్‌కి తిరిగి రావచ్చేందుకు అనుమతినిచ్చింది.

IIT-Bombay : అఫ్ఘాన్‌ విద్యార్థులు క్యాంపస్‌ హాస్టల్‌లో ఉండచ్చు..

Iit Bombay Allows Afghan Students To Return To Campus

Updated On : August 17, 2021 / 7:31 AM IST

IIT-Bombay- Afghan students : అఫ్ఘాన్ విద్యార్థులకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే యూనివర్శిటీ శుభవార్త చెప్పింది. క్షణక్షణం అంతులేని భయంతో బతుకుతున్న అఫ్ఘాన్ విద్యార్థులను క్యాంపస్ హాస్టల్లోకి  తిరిగి వచ్చేందుకు అనుమతిచ్చింది. కరోనా కారణంగా అఫ్ఘానిస్తాన్ వెళ్లిపోయిన ఐఐటీ బాంబే విద్యార్థులు తిరిగి క్యాంపస్ హాస్టల్‌కి వచ్చి ఉండవచ్చునని పేర్కొంది.  స్కాలర్‌షిప్‌ల కింద ఈ ఏడాది మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో అఫ్ఘాన్ నుంచి చాలా మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చింది.  కరోనా కారణంగా ప్రస్తుతం వారంతా తమ స్వదేశంలోని ఇళ్ల నుంచే ఆన్‌లైన్ క్లాసుల్లో పాల్గొంటున్నారు.
Afghan Airspace Closed :అఫ్గానిస్థాన్ గగనతలం మూసివేత..విమానాల రాకపోకలు నిలిపివేత

తాలిబన్ల ఆక్రమణతో అఫ్ఘానిస్తాన్‌ పరిస్థితులు దారుణంగా మారాయి. తాలిబన్‌ల పాలన కారణంగా అఫ్ఘాన్ నుంచి బయటకు వచ్చి క్యాంపస్‌లోని హాస్టల్స్‌లో చేరాలని విద్యార్థులంతా భావిస్తున్నారు. వారి తిరిగి క్యాంపస్‌కు రావచ్చని ఐఐటీ-బాంబే ప్రకటించింది. తిరిగి క్యాంపస్‌కు రావాలన్న విద్యార్థుల అభ్యర్థనను అంగీకరించింది. దాంతో విద్యార్థులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఐఐటీ బాంబేతో పాటు దేశంలోని పలు యూనివర్సిటీల్లో అఫ్ఘానిస్తాన్ విద్యార్థులు చదువుతున్నారు. కరోనా కారణంగా స్వదేశం వెళ్లిన ఆ విద్యార్థులు ఇప్పుడు తాలిబన్ల నిర్బంధంలో చిక్కుకుపోయారు. మళ్లీ తమను భారత్‌కు అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఐఐటీ బాంబే మాదిరిగానే ఇతర వర్సిటీలు కూడా అప్ఘాన్ విద్యార్థులకు క్యాంపస్ హాస్టల్‌లో చేరేందుకు అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి.