6 దేశాలకు భారత్ వ్యాక్సిన్ సాయం

6 దేశాలకు భారత్ వ్యాక్సిన్ సాయం

Updated On : January 19, 2021 / 8:11 PM IST

COVID vaccines ఆర్థికసాయం కింద ఆరు దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్లను అందించనున్నట్లు మంగళవారం(జనవరి-19,2021)భారత ప్రభుత్వం ప్రకటించింది. మాల్దీవులు,భూటాన్,బంగ్లాదేశ్,నేపాల్,సీషెల్స్,నేపాల్,మయన్మార్ దేశాలకు బుధవారం(జనవరి-20,2021) నుంచి వ్యాక్సిన్లను అందించనున్నట్లు తెలిపింది.

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్లు సప్లయ్ చేయాలని పొరుగుదేశాలు మరియు భాగస్వామ్య దేశాల నుంచి భారత్ కు పలు అభ్యర్థనలు వచ్చాయని కేంద్ర విదేశీవ్యవహారాలవాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ అభ్యర్థనలకు స్పందనగా మరియు భారత వ్యాక్సిన్ ఉత్పత్తి,డెలివరీ సామర్థ్యాన్ని కోవిడ్ మహమ్మారిపై పోరాడుతున్నవారందికీ సహాయం కోసం ఉపయోగించాలన్న నిబద్దతకు భారత్ కట్టుబడిఉన్నందున జనవరి-20నుంచి గ్రాంట్ అసిస్టెన్స్(ఆర్థిక సాయం)కింద ఆరు దేశాలకు వ్యాక్సిన్ డెలివరీ ప్రారంభమవుతుందని ఆ ప్రకటనలో విదేశాంగశాఖ తెలిపింది. త్వరలో శ్రీలంక,ఆప్గనిస్తాన్,మారిషస్ దేశాలకు కూడా వ్యాక్సిన్ డెలివరీ చేయనున్నట్లు తెలిపింది.

కాగా, భారత్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. రెండు వ్యాక్సిన్లు(కోవిషీల్డ్,కోవాగ్జిన్)అత్యంత సురక్షితంగా పనిచేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇప్పటివరకు 4,54,049 మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించినట్లు మంగళవారం(జనవరి-19,2021) కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ స్వీకరించినవారిలో 0.18 శాతం మందిలో మాత్రమే ప్రతికూల ప్రభావాలు తలెత్తాయని.. 0.002 శాతం మందికి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అవసరమైందని తెలిపింది.