ఉగ్రవాదంపై యుద్ధానికి ప్రధాని మోదీ చెప్పిన డేట్ అండ్ టైమ్ వచ్చేసిందా..? పాకిస్థాన్ పై ఎటాక్ కి ముహూర్తం ఖరారు?

భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి స్పందించింది.

ఉగ్రవాదంపై యుద్ధానికి ప్రధాని మోదీ చెప్పిన డేట్ అండ్ టైమ్ వచ్చేసిందా..? పాకిస్థాన్ పై ఎటాక్ కి ముహూర్తం ఖరారు?

PM Modi

Updated On : May 6, 2025 / 10:25 AM IST

పాకిస్థాన్‌పై సైనిక చర్యకు భారత్‌ ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్‌ తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఈ వారాంతంలోపు పాకిస్థాన్‌పై భారత్‌ భారీ ఆపరేషన్‌కు దిగవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

దేశంలోని అనేక రాష్ట్రాలకు కేంద్ర సర్కారు నిన్న కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. సివిల్‌ మాక్‌ డ్రిల్స్‌కు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. 1971లో పాకిస్థాన్‌తో భారత్‌కు యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఇటువంటి డ్రిల్స్‌ నిర్వహించారు.

మళ్లీ అటువంటి డ్రిల్స్ రేపు జరగనున్నాయి. వైమానిక దాడులు జరిగితే ప్రజలను సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ఇటువంటి మాక్‌ డ్రిల్‌ను రేపు నిర్వహిస్తారు. దాడులు జరిగే ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తే వంటి చర్యలను కూడా ఈ డ్రిల్స్‌లో భాగంగా చేపడతారు. ఈ డ్రిల్స్‌ అన్నీ ప్రజలకు అవగాహన కల్పించడం కోసం చేస్తున్నారు. పౌర రక్షణ చర్యల విషయంలో ప్రజలకు ట్రైనింగ్ ఇస్తారు.

Also Read: పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. సివిల్‌ మాక్‌ డ్రిల్స్‌కు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు.. సైరన్లు మోగిస్తారు.. ఇంకా ఏమేం చేస్తారంటే?

సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతూనే ఉంది. జమ్మూకశ్మీర్ 8 సెక్టార్లలో నిన్న కూడా కాల్పులకు పాల్పడింది. పాక్ చర్యలకు భారత్ దీటుగా బదులిస్తోంది. ఉద్రికత్తల వేళ దేశ రక్షణకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీ నిన్న కీలక సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

సైనిక సన్నద్ధతకు సంబంధించి కీలక అంశాలపై సంబంధిత అధికారులతో మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. త్రివిధ దళాధిపతులతో మోదీ వరుసగా సమావేశం అవుతుండడం గమనార్హం.

భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి స్పందించింది. శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. అందుకోసం సపోర్టు చేసేందుకు తాము సిద్ధమని అన్నారు.

నియంత్రణ రేఖ వెంబడి ఇండియా ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. తాము కూడా దీటుగా సమాధానం చెబుతామని అన్నారు. ప్రధాని మోదీ రాజకీయాల కోసమే దక్షిణాసియాను అణుయుద్ధం వైపు తీసుకెళ్తున్నారంటూ చెప్పుకొచ్చింది. ఖైబర్ ఫక్తూన్వాతో పాటు బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో ఇండియా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలు గుప్పించారు.