ఫైజర్ వ్యాక్సిన్‌పై లోకల్ ట్రయల్స్ దిశగా ఇండియా

Pfizer Vaccine: ఇండియన్ డ్రగ్ రెగ్యూలేటర్ ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ కచ్చితంగా లోకల్ లో నిర్వహించేలా ఉంది. విదేశాల్లో చేసిన ట్రయల్స్ లో వచ్చిన ఫలితాలు ఇక్కడి వాతావరణానికి సరిపడవనే అనుమానంతో మరోసారి పరీక్షలు జరపనుందట. ‘ఏ వ్యాక్సిన్ వాడేందుకైనా.. లోకల్ పాపులేషన్ పై ట్రయల్స్ నిర్వహించిన డేటా అవసరం. ఒకవేళ ఇండియన్ పాపులేషన్ పై ట్రయల్ నిర్వహించిన డేటా ఉన్నట్లు అయితే దానిని ఆమోదించవచ్చు. అలా కాని సమయంలో క్లినికల్ ట్రయల్ కు వెళ్లాల్సి ఉంటుంది’ అని ఓ రీసెర్చర్ చెబుతున్నారు.
కేవలం గ్లోబల్ ట్రయల్ డేటా ఒక్కటే ఉంటే సరిపోదని ఎక్స్‌పర్ట్ కమిటీ అండ్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీజీ సోమనీ చెబుతున్నారు. కొత్త టెక్నాలజీ అప్రూవ్ చేయడానికి రిస్క్ లు ఉంటాయి. ఆర్ఎన్ఏ ప్లాట్‌ఫాంపై ఎమర్జెన్సీ యూసేజ్ కోసం లైసెన్స్ అప్లై చేసేసింది pfizer vaccine. నిజానికి ఈ కొత్త టెక్నాలజీ ఓ దశాబ్దం క్రితానికి సంబంధించినదే.
ఈ వ్యాక్సిన్‌కు యూకే, యూఎస్, బహ్రెయిన్, కెనడాలలో క్లియరెన్స్ సంపాదించి ప్రపంచంలోనే తొలి ఎమ్ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. pfizer vaccine గ్లోబల్ ఫేజర్ 3 క్లినికల్ ట్రయల్ ను దాదాపు 37వేల మందిపై జరిపారు. ఇందులో కేవలం ఆసియా గ్రూపుకు చెందిన వారు కేవలం 4.3శాతం మాత్రమే ఉన్నారు. ట్రయల్స్ ఫలితాల్లో ఓవరాల్ గా 95శాతం అనుకూల ఫలితాలే వచ్చాయి.
విదేశాల్లో ట్రయల్ జరపడానికి స్వదేశంలో నిర్వహించడానికి సామాజిక పరిస్థితుల తేడా కూడా ఉంది. దీనిని బట్టి ఇండియా బయట నిర్వహించిన శాంపుల్ సైజ్ అనేది సరిపోదన్నమాట. క్లినికల్ ట్రయల్స్ ఆరోగ్యవంతమైన వాలంటీర్లపై జరిపి మరోసారి కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంది. అప్పటి దాకా మనకు అందిన వివరాలు అనేవి సరిపోవు’ అని శాన్ఫోర్డ్ బెర్న్‌స్టీన్ ఇండియా హెల్త్ కేర్ అనలిస్ట్ నిత్యా బాలసుబ్రహ్మణ్యం అంటున్నారు.