జయహో మహిళా : భారత నౌకాదళ తొలి మహిళా పైలట్‌గా శివాంగి

  • Published By: veegamteam ,Published On : December 3, 2019 / 05:26 AM IST
జయహో మహిళా : భారత నౌకాదళ తొలి మహిళా పైలట్‌గా శివాంగి

Updated On : December 3, 2019 / 5:26 AM IST

భారత నౌకాదళంలో పైలట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా సబ్-లెఫ్టినెంట్ శివాంగి రికార్డు సృష్టించారు. సోమవారం (డిసెంబర్ 2) కేరళలోని కొచి నౌకాదళ స్థావరంలో  ఉన్నతాధికారుల సమక్షంలో శివాంగి యుద్ధ విమానాన్ని విజయవంతంగా నడిపారు. 

ఈ సందర్భంగా 24 ఏళ్ళ శివాంగి మాట్లాడుతూ..పైలెట్ కావాలని తన చిన్ననాటి కల అని తెలిపారు. విమానం నడపాలని చిన్నప్పుడు విమానం చూసినప్పటి నుంచి అనుకునేదాన్ని. కానీ ఆ కల సాకారం అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాదు భారతదేశానికి సేవలందించే భాగ్యం తనకు కలిగినందుకు..ఈ రకంగా తనక కల నెరవేరటమే కాదు.. తన దేశానికి సేవలు అందించే అవకాశం లభించినందుకు గర్వంగా ఉందని  శివాంగి ఉద్వేగంగా తెలిపారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన శివాంగి ఐఎన్‌ఎస్ గరుడ యుద్ధ నౌకపై డార్నియర్ స్కాడ్‌లో భాగంగా ఆమె ఇనాస్ 550 నిఘా విమానాలను నడుపనున్నారు.

అన్ని రంగాల్లో మహిళలు వీరోచితంగా దూసుకుపోతున్నారు అనటానికి శివాంగి ఒక ఉదాహరణ. ప్రతిభాపాటవాలతో మహిళలు జయహో అనిపించుకుంటున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. ఆకాశమే హద్దుగా మహిళలు విజయ కేతనాలు ఎగురవేస్తున్నారు. ఇటువంటి మరింతమంది మహిళలు భారత దేశం కోసం సేవలందిస్తున్నారు. పురుషుల కంటే మేమేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. విజయగీతకలు ఆలపిస్తున్నారు.