‘భూమిపై ఎక్కువగా కష్టపడి పనిచేసే వ్యక్తులు భారతీయులు’.. అందుకు కారణం ఇదే.. ప్రముఖ యూట్యూబర్ పోస్టుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ..

ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్, పాపులర్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అక్షత్ శ్రీవాస్తవ తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

‘భూమిపై ఎక్కువగా కష్టపడి పనిచేసే వ్యక్తులు భారతీయులు’.. అందుకు కారణం ఇదే.. ప్రముఖ యూట్యూబర్ పోస్టుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ..

Updated On : June 26, 2025 / 2:21 PM IST

Akshat Shrivastava: ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్, పాపులర్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అక్షత్ శ్రీవాస్తవ అందరికీ సుపరిచితమే. ఇటీవల అతను ఓ నెటిజన్ పెట్టిన పోస్టును ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో ఆసక్తికర పోస్టు చేశారు. భూమిపై ఎక్కువ సమయం కష్టపడి పనిచేసే వ్యక్తులు భారతీయులు అంటూ పేర్కొన్నారు. ఇందుకు కారణాన్ని వెల్లడించారు. చిన్నప్పటి నుంచి వారిపై మన చుట్టూ ఉండే వ్యవస్థల ద్వారా ఒత్తిళ్లు ఉంటాయి. ఉదాహరణ: ఐఐటీలు చదువుతున్న పిల్లలు రోజుకు 10-12 గంటలు చదువుతారు. యుక్త వయస్సులోనూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది.. ఎక్కువ సమయం కష్టపడి పనిచేయడం అలవాటుగా మారుతుంది.

Also Read: AP PGCET 2025 Results: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

కష్టపడి పనిచేసే చాలా మంది భారతీయులు విదేశాలకు వలస వెళతారు. వారి యూరోపియన్ సహఉద్యోగులకు పనిచేసే సమయం తక్కువగా ఉంటుంది. కానీ, భారతీయులు తమ నిద్ర, కుటుంబం, ఆరోగ్యాన్ని త్యాగం చేసి తమ సంస్థకు సేవ చేస్తారు. చాలా మంది కష్టపడి పనిచేసే పిల్లలకు కష్టపడి పనిచేయడం తప్ప వేరే మార్గం లేదు. నైపుణ్యాలను, జ్ఞానాన్ని పెంచుకోవడం.. మెరుగైన జీవతాన్ని నిర్మించుకోవడం.. అదే వారి ఏకైక ఎంపిక అంటూ భారతీయలు విద్యార్థి దశ నుంచి ఎలా కష్టపడతారనే విషయాన్ని అక్షత్ శ్రీవాస్తవ చెప్పుకొచ్చారు. అయితే, ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఓ నెటిజన్.. ‘ఎక్కువ పనిగంటలు పనిచేస్తున్నప్పటికీ.. ఫలితం తక్కువగా వచ్చినప్పుడు. అధిక శ్రమను తక్కువ చేస్తుంది.’ అంటూ పేర్కొన్నాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. నిర్భందించటాన్ని ఏకైక మార్గంగా మనం భావిస్తుండటం విచ్ఛిన్నమైన వ్యవస్థలను అంగీకరించినట్లుగా అనిపిస్తుంది. నిజమైన జ్ఞానం, నైపుణ్యం కోసం ప్రయత్నం చేయడానికి మద్దతు ఇవ్వాలి..అంటూ పేర్కొన్నాడు. టీనేజర్ల యవ్వనాన్ని దోచుకుంటూ.. తరగతిలో అగ్రస్థానంలో ఉండాలనే ఒత్తిడి చిన్నవయస్సులోనే ఎందుకు ప్రారంభమవుతుంది..? అంటూ ఓ వినియోగదారుడు ప్రశ్నించాడు. ఓ నెటిజన్ ‘కష్టపడి పనిచేయడం సమస్య కాదు. మంచి మైండ్‌సెట్ ముఖ్యం. భారతీయులు తెలుసుకోవాలి. కష్టపడి పనిచేయడం విజయానికి కీలకం కాదు.’ అంటూ పేర్కొన్నాడు.