India Covid-19 : భారత్ లో కరోనా..24 గంటల్లో లక్షా 65 వేల 553 కేసులు

India Covid-19 : భారత్ లో కరోనా..24 గంటల్లో లక్షా 65 వేల 553 కేసులు

India Covid

Updated On : May 30, 2021 / 2:16 PM IST

India New Covid-19 Cases : భారత్‌లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. దేశంలో నిత్యం రెండు లక్షలకు దిగువలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా లక్షా 65వేల 553 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3 వేల 460 మరణాలు చోటు చేసుకున్నాయి. 46 రోజుల తర్వాత తక్కువ కేసులు నమోదయ్యాయి. ఆరు రోజులుగా దేశంలో పాజిటివిటీ రేటు పడిపోతుంది. వంద మందిలో 10 మంది లోపే వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో వంద మందిలో 91 మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉండడంతో వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది.
ప్రస్తుతం భారత్‌లో 21 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. 3 లక్షలకు మందికి పైగా మృతి చెందారు. ఢిల్లీ, యూపీ, తెలంగాణ, పంజాబ్, బీహార్ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ కేసులు తగ్గాయి. కేవలం ఆరు రాష్ట్రాల్లోనే లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

సెకండ్ వేవ్‌ ఉధృతితో భారత్‌ను ముంచెత్తిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మెజార్టీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌తో వైరస్ వ్యాప్తిని నియంత్రించడంతో.. పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కేవలం మూడు వారాల్లోనే దేశంలో 50 శాతం కరోనా కేసులు తగ్గాయి. కోవిడ్ సెకండ్ వేవ్‌లో ఏకంగా 4 లక్షలకు పైగా నమోదైన కేసులు.. ఇప్పుడు 2 లక్షలకు దిగువకు చేరాయి. లాక్‌డౌన్, కర్ఫ్యూ ఆంక్షలతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడం వల్లే ఇది సాధ్యమైనట్లు కేంద్రం వైద్యారోగ్య శాఖ చెబుతోంది.

కరోనా మొదటి వేవ్‌లో దేశంలో సగటు రోజువారీ కేసులు సెప్టెంబర్ 17 న 93 వేల 735కు చేరుకున్నాయి. కేవలం ఆరు వారాల్లోనే కేసులు తగ్గిపోయాయి. అక్టోబర్ 30 నాటికి 50 శాతం కేసులు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే కరోనా మరణాలు తగ్గుముఖం పట్టడం లేదు. కాకపోతే గత వారం రోజులుగా పరిశీలిస్తే 18 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోనే మరణాల సంఖ్య అధికంగా నమోదవుతున్నాయి. కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్‌లోనే భారత్‌లో అధికంగా కేసులు నమోదయ్యాయి. అయితే సెకండ్‌ వేవ్‌ ఉధృతితో ముందే అప్రమత్తమైన రాష్ట్రాలు.. పకడ్బందీ చర్యలతో కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమించాయి.

దీంతో కేసుల తీవ్రత 50 శాతం తగ్గింది. ఏప్రిల్ 17న దేశంలో సగటు రోజువారీ కేసులు 2లక్షలకు పైగా నమోదైంది. ఒకానొక సమయంలో 4 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు.. క్రమంగా తగ్గుతూ చివరికి లక్షా 60వేల వరకు చేరింది. కరోనా వైరస్ కేసులు ఈశాన్య ప్రాంతంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో తగ్గుతూ వచ్చాయి. అలాగే నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పాజిటివిటీ రేటు కంటే రికవరీ రేటు పెరుగుతుండడం భారత్‌కు కాస్త ఊరటినిచ్చే విషయమే.

Read More : Australia Rats : ఎలుకలే ఎలుకలు..ప్రజల ఇబ్బందులు, భారత్‌ నుంచి బ్రోమాడియోలోన్ విషం కొనుగోలు!