అయోధ్యలో రామ్ మందిర్ భూమి పూజకి ముస్లింకే మొదటి ఆహ్వానం.. ముఖ్య అతిధులు వీరే!

ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య పర్యటన, రామ్ మందిర్ భూమి పూజన్ కార్యక్రమం కోసం అయోధ్య మొత్తం అజేయమైన కోటగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి రామ్ మందిర్ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీజేపీ సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి కూడా హాజరుకానున్నారు. అయితే, కరోనా ప్రబలుతున్న వేళ అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొననున్నారు.
భూమి పూజ చేసే దగ్గర ప్రధాని మోడీతో పాటు రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహంత్ నృత్య గోపాల్‌దాస్ ఐదుగురు మాత్రమే ఉంటారని ట్రస్ట్ సభ్యులు చెప్పారు. రామ్ మందిర్ భూమి పూజన్ కార్యక్రమంలో హిందువులే కాదు, ఇతర మతాల పెద్దలు, ఇతర వర్గాలు, మతాలకు చెందిన ప్రత్యేక వ్యక్తులను కూడా ఆహ్వానించారు.
భూమి పూజ కార్యక్రమానికి ఇన్విటేషన్ కార్డు(Ram Temple ‘Bhoomi Pujan’ Invitation Card) కాషాయం రంగులో ఉంది. ఈ కార్డుపై ప్రధాని మోడీతో పాటు మరో ముగ్గురి పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. మోడీ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతున్నట్టుగా కార్టులో ఉంది. ఆగస్టు 5వ తేదీన జరగబోయే భూమిపూజ నిమిత్తమై తయారు చేసిన ఆహ్వాన పత్రికలో మొట్ట మొదటి పేరు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ తర్వాత విశిష్ట అతిథి హోదాలో రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) పేర్లు ఉన్నాయి.
రామ మందిర ట్రస్ట్ ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ భూమిపూజకు ఆహ్వానిస్తున్నట్టు కార్డులో ఉంది. కార్డుపై బాల రాముడి చిత్రాన్ని ముద్రించారు. ఈ ఆహ్వాన పత్రికను దాదాపు 150 మంది అతిథులకు పంపినట్టు చెబుతున్నారు. కనీసం 200 మంది అర్చకులు పాల్గొనే ఈ వేడుకలో ప్రధాని మోడీ రామ మందిరానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఇక మొదటి ఆహ్వానం అయోధ్య కేసులో ముస్లీం న్యాయవాదులలో ఒకరైన ఇక్బాల్ అన్సారీకి వెళ్లింది. రామాలయానికి పునాది వేసే కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఆహ్వానం వచ్చిన వెంటనే, నాకు మొదటి ఆహ్వానం రావాలన్నది రాముడి కోరిక అని నేను నమ్ముతున్నాను. అంగీకరిస్తున్నాను అని ఇక్బాల్ అన్సారీ అన్నారు.
బీజేపీ ప్రధాన ఎజెండా, దశాబ్దాలుగా ఎన్నికల వాగ్దానాలకు కేంద్రంగా ఉన్న రామాలయ నిర్మాణానికి ప్రతీకగా 40 కిలోల వెండి ఇటుకను ఏర్పాటు చేయాలని మోడీ భావిస్తున్నారు. 16వ శతాబ్దంలో బాబ్రీ మసీదు నిలబడటానికి ముందు నిలబడిన 2.77ఎకరాల స్థలంలో అనేక సంవత్సరాల వివాదం తరువాత రామాలయం నిర్మించబడుతుంది.
Iqbal Ansari, the main litigant in the Ayodhya land dispute case, gets invitation card for Ram Mandir #BhoomiPoojan pic.twitter.com/SW55Ub3Xn7
— Samarth (@samsrivastava31) August 3, 2020