Karnataka: మగవారికి ప్రతివారం ఉచితంగా రెండు మద్యం బాటిల్స్.. కర్ణాటక అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..

కర్ణాటక అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాన్ని..

Karnataka: మగవారికి ప్రతివారం ఉచితంగా రెండు మద్యం బాటిల్స్.. కర్ణాటక అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..

MT Krishnappa

Updated On : March 20, 2025 / 11:11 AM IST

Karnataka: కర్ణాటక అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాన్ని రూ.40వేల కోట్లకు పెంచారు. అయితే, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో అది రూ.36,500 కోట్లుగానే ఉంది. మద్యం ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ఆలోచనను అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు ఎద్దేవా చేశాయి. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మద్యం ఆదాయం విషయంపై ఆసక్తికర చర్చ జరిగింది.

Also Read: Smita Sabharwal: చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్.. రూ.61లక్షల వివాదం..? నోటీసులు ఇచ్చేందుకు..

సీనియర్ జేడీ(ఎస్) ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప మాట్లాడుతూ.. కేవలం ఒక సంవత్సరంలోనే ప్రభుత్వం మూడుసార్లు ఎక్సైజ్ పన్నులను పెంచింది. దీనివల్ల పేద వర్గాల్లోని మద్యం సేవించే ప్రజలకు భారంగా మారుతుంది. అలాఅని ప్రజలు మద్యం మానేయాలని ఆశించలేం. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల డబ్బుతోనే అమలవుతున్నాయి. అలాంటప్పుడు మద్యం సేవించేవారికి కూడా ప్రతివారం ఉచితంగా రెండు మద్యం బాటిల్స్ ను ప్రభుత్వమే సొసైటీల ద్వారా ఎందుకివ్వకూడదంటూ కృష్ణప్ప పేర్కొన్నారు.

Also Read: పాడి రైతులకు శుభవార్త.. కేంద్ర మంత్రి మండలి కీలక నిర్ణయం.. అదేమిటంటే?

కృష్ణప్ప సూచనకు ఇంధన మంత్రి కెజె జార్జ్ స్పందిస్తూ.. ఎన్నికల్లో గెలిచి, మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అలా మీరే చేయండి అంటూ సెటైర్లు వేశారు. మా ప్రభుత్వంలో ప్రజలు ఎక్కువగా మద్యం సేవించకుండా కట్టడిచేసేలా ప్రయత్నం చేస్తామని అన్నారు.

 

కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్య నిషేదం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎక్సైజ్ ఆదాయం పేదల నుంచి పీల్చిన రక్తం. ఆ డబ్బు దేశాన్ని నిర్మించదని అన్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ ఆదాయం పెంచుకునేందుకే చేస్తున్న ప్రయత్నంపట్ల విపక్ష సభ్యులు సెటైర్లతో అసెంబ్లీలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.