Kamal Hassan: అధికారం ఉన్నా, లేకపోయినా ప్రజా సేవ ఆగదు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో పోటీచేసిన కమల్‌హాసన్ బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల తేడాలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం రెండోసారి కమల్‌హాసన్ కోవై దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజల పెద్దసంఖ్యలో హాజరయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం మక్కల్ నీది మయ్యం పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Kamal Hassan says I will serve beyond politics
Kamal Hassan: మక్కల్ నీది మయ్యం అధికారంలో ఉన్నా, లేకున్నా రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ పేర్కొన్నారు. శనివారం చెన్నైలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన కోవై దక్షిణ నియోజకవర్గంలో మక్కల్ నీది మయ్యం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 800లకు పైగా కుటుంబాలు నివసిస్తున్న నియోజకవర్గ పరిధిలోని సెంబట్టిలోని సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో పోటీచేసిన కమల్‌హాసన్ బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల తేడాలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం రెండోసారి కమల్‌హాసన్ కోవై దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజల పెద్దసంఖ్యలో హాజరయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం మక్కల్ నీది మయ్యం పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.