ఆపరేషన్ కమల్ : కర్నాటకలో పొలిటికల్ హీట్  

  • Published By: madhu ,Published On : January 14, 2019 / 11:32 AM IST
ఆపరేషన్ కమల్ : కర్నాటకలో పొలిటికల్ హీట్  

Updated On : January 14, 2019 / 11:32 AM IST

కర్నాటక : రాష్ట్రంలో పొలిటికల్ పరిణామాలు మారిపోతున్నాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్లాన్స్ చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాషాయ దళం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ముగ్గురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలో వెళ్లడంతో రాజకీయ హీట్ ఎక్కాయి. 
రిసార్ట్స్‌కు ఎమ్మెల్యేలు…
102 మంది ఎమ్మెల్యేలను ఒడిశాలోని ఓ రిసార్ట్స్‌కు బీజేపీ తరలించింది. హై కమాండ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలను తరలించింది. ఎమ్మెల్యేలను అక్రమంగా పార్టీలో చేర్చుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ వర్గాలు ఆరోపణలు గుప్పిస్తోంది. 10 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ అంటోంది. 5గురు బీజేపీ ఎమ్మెల్యేల వరకు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంటోంది. 
ఆపరేషన్ కమల్…
సార్వత్రిక ఎన్నికలకంటే ముందుగానే కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఆపరేషన్ కమల్ ద్వారా ప్రభుత్వాన్ని విచ్చిన్నం చేసేలా జబర్దస్త్ ప్లాన్ చేస్తోంది. మంత్రివర్గం నుండి ఉద్వాసనకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వాన్ని కూల్చి పనిలో బీజేపీ ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ – జేడీఎస్‌ కూటమికి వచ్చిన ఇబ్బందులు ఏవీ లేవని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. 
కాంగ్రెస్..జనతాదళ్…
కొన్ని రాష్ట్రాల్లో బలం లేకపోయినా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గోవా..మణిపూర్, మేఘాలయలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీహార్ నితీష్ నేతృత్వంలోని జేడీఎస్, లాలూ న్యాయకత్వంలోని ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా..ఇరు పార్టీల మధ్య విబేధాలు పొడచూపాయి. దీనిని సాకుగా చేసుకుని ఆర్జేడీని పక్కకు తోసి నితీష్‌కు మద్దతిచ్చింది బీజేపీ. 
ఇక కర్నాటక రాష్ట్ర విషయానికి వస్తే 222 స్థానాల్లో బీజేపీ 104 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌ 78, జనతాదళ్‌(ఎస్‌) తరపున 38, మరో ఇద్దరు స్వతంత్రులూ గెలిచారు. ఇక్కడ మేజిక్ ఫిగర్ 112గా ఉంది. అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా 8 మంది సభ్యుల బలం కావాల్సి ఉంటుంది. ఈ తరుణంలో కాంగ్రెస్‌, జనతాదళ్‌(ఎస్‌) మరో ఇద్దరు ఇండిపెండెంట్స్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.