Kerala Labourer Model: ప్రొఫెషనల్ మోడల్స్‌ను తలదన్నేలా..మోడల్ గా 60 ఏళ్ల రోజువారీ కూలి..

ప్రొఫెషనల్ మోడల్స్‌ను తలదన్నేలా..మోడల్ గా మారిన 60 ఏళ్ల రోజువారీ కూలి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.

Kerala Labourer Model: ప్రొఫెషనల్ మోడల్స్‌ను తలదన్నేలా..మోడల్ గా 60 ఏళ్ల రోజువారీ కూలి..

60 Year Old Daily Wage Labourer Is Now A Model

Updated On : February 15, 2022 / 3:37 PM IST

రోజు కాయకష్టం చేసుకుంటేనే గానీ ఇల్లు గడవని ఓ రోజువారి కూలి ప్రొఫెషనల్ మోడల్స్‌ను తలదన్నేలా..మోడల్ గా మారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. 60 ఏళ్ల వయస్సున్న రోజుకూలి చొక్కా లుంగీ కాదు సూటు,బూటుతో ప్రొఫెషనల్ మోడల్స్‌ను తలదన్నే రీతిలో కనిపించేసరికి అందరూ షాక్ అయ్యారు. అతని ఓ సాధారణ కూలి అని తెలిసి అవాక్కయ్యారు. రోజువారీ కూలి మోడల్ గా మారటమేంటీ? దీని వెనుకున్న కథకమామీషు ఏంటంటే..

కేరళలోని కోజికోడ్‌లో 60 ఏళ్లున్న మమ్మిక్క అనే వ్యక్తి కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటుంటాడు. ప్రతీ ఒక్కరి జీవితాల్లో మార్పు సహజం అని అంటుంటారు. కానీ ఎవరికి ఎటువంటి మార్పు వస్తుందో చెప్పాలే. అలా మమ్మక్కకు అతను కలలో కూడా ఊహించని మార్పు వచ్చింది. మమ్మిక్క ఒంటిపై చొక్కా, లుంగీతో ఓ సాధారణ కూలి ఉన్నట్లే ఉండేవాడు.

కానీ ఉన్నట్లుండి అతని ఒంటిపై చొక్కా, లుంగీ పోయాయి. ఒకేసారి సూటు, బూటుతో ప్రొఫెషనల్ మోడల్స్‌ను తలదన్నే రీతిలో కనిపించి షాకిచ్చాడు.అతడు సడెన్ గా ప్రొఫెషనల్ మోడల్ లాగా మారటానికి కారణం షరీక్ వయాలీల్ అనే ఫొటోగ్రాఫర్. మమ్మిక్కను చూసిన సదరు ఫోటో గ్రాఫర్ అతనిలో ఏదో ఒక ఫోకస్ ఉందని గుర్తించాడు. కాయ కష్టం చేసుకుని మమ్మక్క షరీక్ వయాలీల్ ను ఆకట్టుకున్నాడు. అంతే..అతనితో మాట్లాడాడు.

Also read : physically challenged models : మోడల్‌ గా రాణిస్తున్న దివ్యాంగ యువతులు..

అలా మమ్మిక్కను అతనే గుర్తు పట్టలేనట్లుగా మార్చేశాడు. సూటు, బూటూ వేశాడు. మమ్మిక్క చేతికి ఓ ఐపాడ్ ఇచ్చి కొన్ని ఫొటోలు తీశాడు.ఆ ఫోటోలు చూసి గతంలో అతను ఉన్నప్పటికీ ఇప్పటికి ఎంత తేడా అని అతనే ఆశ్చర్యపోయాడు. చాలా బాగున్నాయి.సూటు బూటులో మమ్మిక్క ప్రొఫెషనల్ మోడల్ లా ఉన్నాడు.ఆ ఫోటోలను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశాడు.

Also read : viral video:అమ్మను మించిన అందం ఏముంది? 60 ఏళ్ల తల్లితో యాడ్ చేసిన డిజైనర్..సూపర్ సక్సెస్

దీంతో ఆ ఫొటోలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ ఫొటోలో ఉన్నది ఎవరంటూ చాలా మంది ఆరా తీయడం ప్రారంభించారు. అతడిని సినీ నటుడు వినాయకన్‌తో పోల్చడం ప్రారంభించారు. అయితే తన లుక్ మారడానికి గల కారణాన్ని మమ్మిక్క బయట పెట్టాడు. ఫొటోగ్రాఫర్ షరీక్ వయాలీల్, మేకప్ ఆర్టిస్టులు మజ్నాస్, ఆషిక్ ఫువాద్, షబీబ్ వయాలీల్ కారణంగా తన జీవితం మారిపోయిందన్నారు.

Daisy-May Demetre : కాళ్లు లేని చిన్నారి క్యాట్ వాక్..ఆత్మవిశ్వాసం ముందు తలవంచిన అంగవైకల్యం
సాధారణ కూలీ స్థాయి నుంచి మోడల్‌గా మారానని సంతోషంగా చెబుతున్నాడు. తనను చుట్టుపక్కల వారు కూడా గుర్తు పట్టడం లేదని..ఈ గొప్పతనం అంతా ఫోటో గ్రాఫర్ షరీక్ వయాలీల్ దేనంటున్నాడు.ఇప్పుడు మమ్మికను తన స్వస్థలమైన కోజికోడ్‌లో ఎవరూ కూలీగా గుర్తించడం లేదు. అతను వెన్నక్కాడ్, కొడివల్లి ప్రాంతాల్లో స్థానికులకు హీరోగా మారాడు.