క్వారంటైన్‌ను పక్కకుబెట్టి కేరళ నుంచి యూపీ వెళ్లిన ఐఏఎస్ ఆఫీసర్‌పై సీరియస్

క్వారంటైన్‌ను పక్కకుబెట్టి కేరళ నుంచి యూపీ వెళ్లిన ఐఏఎస్ ఆఫీసర్‌పై సీరియస్

Updated On : March 27, 2020 / 10:37 AM IST

కేరళలో విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేసి ఉత్తరప్రదేశ్ వెళ్లాడు. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రా సింగపూర్ నుంచి గురువారం తిరిగొచ్చాడు. ప్రొటోకాల్ ప్రకారం.. విదేశాల నుంచి తిరిగొచ్చాక కరోనా వ్యాప్తి కాకుండా ఉండేందుకు సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లాలి. అవేమీ పట్టించుకోకుండా ఉత్తరప్రదేశ్ లో ఉన్న కాన్పూర్ కు చెక్కేశాడు. 

పెళ్లి అయిన తర్వాత సెలవుపై మలేసియా, సింగపూర్ టూర్లు వేసిన ఐఏఎస్ ఆఫీసర్ రిపోర్టు చేయడానికి బ్యూరోక్రాట్‌కు సెలవులు. కొ’అందుకోసమే కొల్లాం సబ్ కలెక్టర్ మార్చి 19న డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు తిరిగొచ్చాడు. అప్పుడు గుర్తొచ్చిందో ఏమో.. ముందుజాగ్రత్త చర్యగా హోమ్ క్వారంటైన్ కు అనుమతి తీసుకున్నాడు.  విదేశాల నుంచి వచ్చానని క్వారంటైన్ కు వెళ్తానని చెప్పి కొల్లాం నుంచి కాన్పూర్ వెళ్లిపోయాడు. డ్యూటీలో జాయిన్ అయిన రోజే వెళ్లిపోవడం శోచనీయం. 

ఆ తర్వాత అధికారుల ఆదేశాల మేరకు కేరళ ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకున్నాడు. ‘ఇది బాధ్యతారహితమైన చర్య. ఇంకా దీని గురించి ఏం చెప్పాలి. అతనిపై తగిన చర్యలు తీసుకుంటాం. కొల్లాంలో ఉండకుండా వెళ్లిపోయాడని కేరళ మత్స్య శాఖ మంత్రి జే మెర్సికుట్టీ అమ్మా అన్నారు. 

కరోనా పాజిటివ్ ఒక్కటి కూడా నమోదుకాని జిల్లా కొల్లాం. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 126 కరోనా కేసులు నమోదయ్యాయి. 12మంది మహమ్మారి నుంచి బయటపడ్డారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.