Leopard Hunts: పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత .. వీడియో

Leopard Hunts: పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత .. వీడియో

Leopard Hunts (2)

Updated On : June 12, 2021 / 11:33 AM IST

Leopard Hunts: అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ప్రజలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. జనావాసాల్లో ఉండే సాధుజంతువులపైన దాడులు చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాషిక్‌ సమీపంలో చిరుత కుక్కను ఎత్తుకెళ్లింది. రాత్రి వేళ ఇంటి ముందు పడుకుందో పెంపుడు కుక్క. మాటువేసిన చిరుత ఎలాంటి అలికిడి చేయకుండా దానిని నోట కరుచుకుని వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యారు.

జనావాసాల్లో చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు హడలిపోతున్నారు. ఇక ఘటనపై పెంపుడు కుక్క యజమాని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ చిరుత గతంలో కూడా పెంపుడు కుక్కలపై దాడి చేసి ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.