Domestic Violence : అందరూ ఇంట్లోనే..లాక్ డౌన్‌లో పెరుగుతున్న గృహహింసలు..

Domestic Violence : అందరూ ఇంట్లోనే..లాక్ డౌన్‌లో పెరుగుతున్న గృహహింసలు..

Domestic Violence

Domestic violence on Womens: సాధారణ రోజుల్లో కంటే లాక్‌డౌన్‌ లో మహిళలపై గృహహింస కేసులు పెరుగుతున్నాయని హైదరాబాద్ అదనపు డీజీ స్వాతి లక్రా తెలిపారు. సాధారణ రోజుల్లో కంటే లాక్‌డౌన్‌ లో నమోదైన గృహహింస ఘటనలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. అందరూ ఇళ్లల్లో ఉండటంతో మహిళలపై పనిభారం పెరుగుతోంది. బయటకెళ్లే పరిస్థితి లేక..పనిలేక..మగవారు ప్రస్టేషన్ కు గురికావటం..అదంతా ఇంట్లో ఆడవాళ్లమీద చూపించటం..పిల్లలు కూడా స్కూల్స్, కాలేజీలు లేక ఇంట్లోనే ఉండటంతో పనిభారం పెరుగుతోంది. వారి చిరాకులు..మగవారు ప్రస్టేషన్లు అన్నీ ఇంట్లో ఉండే ఆడవారిమీద చూపింటంతో వారు అటు పని ఒత్తిడి. ఇటు ఉద్యోగినులు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ తో సతమతమవుతున్నారని తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్‌లో కేవలం 13 రోజుల్లోనే గృహహింసకు గురైన బాధితులు తమకు ఫోన్ చేస్తున్నారని..డయల్ 100కు ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. గృహహింసకు గురవుతున్నావారు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీ స్వాతి లక్రాసూచించారు. లాక్‌డౌన్‌ వల్ల అందరూ ఇంట్లోనే ఉంటున్నారని ఈ నేపథ్యంలో గృహహింసలు పెరుగుతున్నాయనీ..తమకు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ఏ సమయంలో ఫోన్ చేసినా స్పందిస్తామని..ఏమాత్రం సంకోచించకుండా మాకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ లాక్ డౌన్ సమయంలో కూడా షీ టీమ్స్ పనిచేస్తున్నాయని..లాక్ డౌన్ అమలులో ఉంది కాబట్టి మహిళలు బయటకు రాకుండా వెంటనే 100కు ఫోన్ చేయవచ్చునని..లేదా షీ టీమ్స్ కూడా తెలియజేయవచ్చునని స్వాతి లక్రా తెలిపారు.