PM Modi స్పీచ్ హైలెట్స్.. విభిన్నంగా వేగంగా స్పందించాం

భారతీయులంతా COVID 19పై ట్రైనింగ్ తీసుకున్న సైనికుల్లా.. పనిచేస్తున్నారు. జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. లాక్‌డౌన్‌ను మే3 వరకూ పొడిగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశపౌరులను పొగడ్తలతో ముంచెత్తారు. భారత్ కరోనాపై పోరాడటంలో మంచి శ్రద్ధ కనబరుస్తుంది. ఓ మూడు విషయాలు మాత్రం ఇతర దేశాల కంటే విభిన్నంగా, వేగంగా చేయడం వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగుతున్నామని మోడీ చెప్పారు.
i. భారత అందరి కంటేముందే కవచం ఏర్పాటు చేసుకుంది. ఒక్క కేసు కూడా భారత్ లో నమోదవకముందే విదేశీ ప్రయాణికులను పరీక్షించాకే దేశంలోకి అనుమతించాం. అమెరికా, యూరప్ దేశాల కంటే ముందుగానే నిషేదాలు విధించాం.
ii. కొవిడ్-19 కేసులు వందకు చేరకముందే ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి 14రోజుల ఐసోలేషన్ తప్పనిసరి చేసింది ఇండియా. వారిలో వైరస్ లక్షణాలు కనిపించకపోయినా ముందుగానే సూచనలు ఇచ్చాం. వీటితో పాటు సినిమా థియేటర్లు, క్లబ్బులు మూసేశాం. మోడీ చెప్పిన దాని ప్రకారం.. ఇన్ఫెక్షన్లు అడ్డుకోవడానికి తరచూ మీడియా ముందుకు వచ్చి ప్రజల్లో ధైర్యాన్ని నింపారట.
iii. 21రోజుల లాక్‌డౌన్ విషయానికొస్తే.. భారత్ లో 550 కేసులు నమోదయ్యేసరికి ఈ ప్రక్రియ మొదలుపెట్టాం. పీఎం చెప్పిన దాని ప్రకారం.. ఇతర దేశాలేవీ నిర్ణయం తీసుకోకముందే లాక్‌డౌన్ ముందుగానే ప్రకటించింది భారత్. తద్వారా కేసులు నమోదవడం కూడా తగ్గింది.
ఇంకా.. ఇతరదేశాలతో పోల్చుకోవడం మంచి పద్ధతి కాదు. కొన్ని వాస్తవాలను ఒప్పుకోకతప్పదు. కీలక సమయాల్లో ఇతర దేశాల కంటే విభిన్నంగా ఆలోచించాం. ప్రస్తుతం పరిస్థితి మన అదుపులోనే ఉంది. అంటూ ఓ ఉదహరణ చెప్పారు.
నెల క్రితం ఇండియా ఇతర దేశాలతో పాటు సమానమైన ప్లేస్ లోనే ఉంది. ఇప్పుడు వాటితో పోల్చుకుంటే 25-30 సార్లు తక్కువ కేసులు నమోదయ్యాయి. సామాజిక దూరం, లాక్ డౌన్ అనేవి కీలకంగా పనిచేశాయి. ఎకానమీపై ప్రభావం పడినా తప్పలేదు.