కిక్కే కిక్కు : ఫారిన్ మద్యం ఆన్ లైన్‌లో ఆర్డర్ ఇవ్వొచ్చు

ఫారిన్ మద్యం కావాలంటే..ఎలా..అక్కడ దాకా వెళ్లాల్సిందేనా ? అవసరం లేదంటోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఎంచక్కా..ఆన్ లైన్‌లో ఒక్క క్లిక్ చేసి మద్యం ఇంటి వద్దకు తెచ్చుకోవచ్చని వెల్లడిస్తోంది. ఇప్పటికే ఎన్నో వస్తువులు ఆన్ లైన్ ద్వారా తెచ్చుకుంటున్నారు. ఏదైనా కొన్నాలన్నా..క్లిక్ మనిపించాల్సిందే. ఇప్పటి వరకు మద్యం ఇందులో చేర్చపడలేదు. దీనిని కూడా ఆన్ లైన్‌లో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
2020-21 సంవత్సరానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన ఎక్సైజ్ విధానాన్ని పునరుద్దరించింది. దీని ప్రకారం రాష్ట్రంలో కొత్తగా మద్యం షాపులు తెరవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే..విదేశీ మద్యం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఆన్ లైన్‌లో విదేశీ మద్యం పంపిణీ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకించింది. కమల్ నాథ్ ప్రభుత్వం మద్యప్రదేశ్‌ను మద్యం రాష్ట్రంగా మార్చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామేశ్వర్ శర్మ ట్వీట్ చేశారు.
మరికొన్ని నిర్ణయాలు :-
* అక్రమ మద్యం నిరోధించడానికి బాటిళ్లపై బార్ కోడ్‌లను ప్రవేశపెడుతారు.
* ద్రాక్ష పండుతో తయారు చేసిన వైన్ ప్రమోషన్స్ కోసం పర్యాటక ప్రదేశాల్లో 15 కొత్త వైన్ అవుట్ లెట్లను తెరవాలని నిర్ణయం. వీటి ఫీజు రూ. 10 వేలుగా నిర్ణయం.
* మద్యం దుకాణాలపై 25 శాతం ఆదాయం పెంచుకొనేందుకు కొత్త స్కీమ్‌కు శ్రీకారం.
* 1061 విదేశీ మద్యం షాపులకు టెండర్లు. ఈ దుకాణాల ద్వారా ఆన్ లైన్ మద్యం విక్రయాలు.
* వైన్ షాపు ఉన్న 5 కిలోమీటర్ల పరిధిలో మరో మద్యం దుకాణాన్ని ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది. దీనిని బీజేపీతో పాటు అధికార పార్టీ కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు వ్యతిరేకించారు.
“कमलनाथ सरकार शराब के साथ आपके द्वार”
कमलनाथ जी आपकी सरकार में ऐसा कौन है जो शराब के उत्थान में पूरी तन्मयता के साथ जुटा है ? या तो इनकी शराब कंपनी है या ठेके है पहले गली मोहल्ले में शराब दुकान का प्रस्ताव अब ऑनलाइन शराब बिक्री ।
@BJP4MP @ChouhanShivraj @vdsharmabjp— Rameshwar Sharma (@rameshwar4111) February 22, 2020