6 నెలల కష్టానికి ఫలితం దక్కింది. ఇద్దరు కూలీలకు దొరికిన వజ్రాలు

  • Published By: nagamani ,Published On : November 5, 2020 / 10:53 AM IST
6 నెలల కష్టానికి ఫలితం దక్కింది. ఇద్దరు కూలీలకు దొరికిన వజ్రాలు

Updated On : November 5, 2020 / 12:44 PM IST

Madhya pradesh Panna two labourers diamonds : ఆశ..ప్రతీ మనిషి జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా ఆశ అనేది కచ్చితంగా ఉంటుంది. ఆశ అనేది లేకపోతే ఏ మనిషి బతకలేడు. కష్టాలు..కన్నీళ్లు..ఆర్థిక సమస్యలు ఇలా ఏదైనా సరే ఈ కష్టాల నుంచి ఎప్పటికైనా సరే బైటపడతామనే ఆశతోనే ప్రతీ మనిషి బతుకుతుంటాడు. అటువంటి ఆశతోనే జీవించే ఇద్దరు రోజువారీ కూలీల బతుకుల్లో వెలుగులు వచ్చాయి. అలాటిలాంటి వెలుగులు కాదు ‘వజ్రాల’ వెలుగులు వచ్చాయి.


ఇద్దరు కూలీల ఆరు నెలల కష్టం ఫలించింది. కళ్లలో వత్తులు వేసుకుని కళ్లు ఇంతంత చేసుకుని తళుక్కుమని ఎక్కడ మెరిస్తే అక్కడకు వారి కళ్లు చటుక్కుని ఆ వైపు తిరిగిపోయేవి. ఆ వెలుగులు మా కష్టాలు తీర్చేస్తాయనే గంపెడంత ఆశతో మట్టిలో, రాళ్లలో సాగిన వెతుకలాట ఎట్టకేలకు నెరవేరింది. ఇద్దరు కూలీలు పిసరత రాళ్లతో లక్షాధికారులయ్యారు.


మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఇద్దరు కూలీలకు వజ్రాలు లభించాయి. వారిద్దరికీ కలిపి కోటి రూపాయల విలువైనవి దొరికాయి. వాటిని చూసినవారి ఆనందం అంతా ఇంతా కాదు..మా ఈ కష్టాలు ఇక తీరిపోతాయని తెగ గెంతులేశారు. సంబరాలు చేసుకున్నారు.


పన్నా జిల్లాలో వజ్రాల వేటలో భాగంగా జరువపూర్‌కు చెందిన దిలీప్ మిస్ర్తీ అనే కార్మికుడికి 7.44 కేరట్ల బరువైన వజ్రం దొరికింది. అలాగే కృష్ణక‌ల్యాన్‌పుర్ ప్రాంతంలో ల‌ఖ‌న్ యాద‌వ్ అనే మ‌రో కార్మికుడు 14.98 కేరట్ల బరువైన వజ్రాన్ని దొరకబుచ్చుకున్నాడు.


ఈ వజ్రాల వేటపై అధికారులు నిత్యం డేగ కన్నేసి ఉంచడంత విషయం వారికి చెప్పారు. మాకు వజ్రాలు దొరికాయి సార్ అంటూ. చాటుమాటుగా అమ్మితే వాటిని అమ్మిన డబ్బులు మొత్తం వారికే వస్తాయి. కానీ వాటితో సమస్యలు కూడా వస్తాయని వారికి తెలుసు. దీంతో దిలీప్, లఖన్ యాదవ్ లు తమకు దొరికిన వజ్రాల గురించి అధికారులకు చెప్పారు.


ఇద్దరూ కలిసి తమకు దొరికన వజ్రాలను అధికారులకు వాటిని అందజేశారు. వాటిని వేలంలో అమ్ముతామని.. ఆ వచ్చిన సొమ్ములో 12.5 శాతం రాయల్టీగా తీసుకుని కుని మిగతా సొమ్ము వారికి అందజేస్తామని అధికారులు చెప్పారు. మిస్త్రీకి దొరికిన వజ్రం రూ. 30 లక్షలు, యాదవ్‌కు దొరికిన వజ్రం రూ. 60 లక్షలకుపైగా ధర పలుకుతాయని డైమండ్ చెకింగ్ ఇన్‌స్పెక్ట‌ర్ అనుప‌మ్ సింగ్ చెప్పారు.


ల‌ఖ‌న్ యాద‌వ్‌కు తన రెండు ఎకరాల భూమిలో తొలిసారి వజ్రాన్ని దక్కించుకున్నాడు. తనకొచ్చే డబ్బుతో పిల్లల్ని బాగా చదివిస్తానని లఖన్ యాదవ్ ఆశపడుతున్నాడు. తన కష్టాన్ని దేవుడు గుర్తించాడని భగవంతుడి దయవల్లే తనకు వజ్రం దొరికిందని మిస్త్రీ సంబరంగా చెబుతున్నాడు.