Akhil Bharatiya Akhara parishad : అఖాడా ప‌రిష‌త్ చీఫ్‌గా మ‌హంత్ బ‌ల్బీర్ గిరి

అఖిల భార‌తీయ అఖాడా ప‌రిష‌త్ చీఫ్‌గా మ‌హంత్ బ‌ల్బీర్ గిరి(35) పీఠాధిప‌త్య బాధ్యతలు స్వీకరించనున్నారు.

Akhil Bharatiya Akhara parishad : అఖాడా ప‌రిష‌త్ చీఫ్‌గా మ‌హంత్ బ‌ల్బీర్ గిరి

Balbir Giri

Updated On : September 29, 2021 / 12:44 PM IST

Akhil Bharatiya Akhara parishad :  అఖిల భార‌తీయ అఖాడా ప‌రిష‌త్ చీఫ్‌గా మ‌హంత్ బ‌ల్బీర్ గిరి(35) పీఠాధిప‌త‌్య బాధ‌్యతలు స్వీకరించనున్నారు. సాంప్ర‌దాయం ప్ర‌కారం అక్టోబ‌ర్ 5వ తేదీన మ‌హంతి బ‌ల్బీర్ గిరికి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారు. ఉత్తరాఖండ్ కు చెందిన 35 ఏళ్ల బల్బీర్ గిరి గత 15 సంవత్సరాలుగా మహంత్ నరేంద్రగిరికి అత్యంత విశ్వసనీయ శిష్యుడు.

2005 లో సన్యాసం తీసుకోటానికి తన కుటుంబాన్ని వీడి వచ్చాడు. 2005లో నరేంద్ర గిరి బల్బీర్ కి దీక్ష ఇచ్చారు. బల్బీర్ ప్రస్తుతం హరిద్వార్ లోని బిల్కేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని చూసుకుంటున్నారు.

ఇటీవ‌ల అనుమానాస్పద రీతిలో మ‌ర‌ణించిన మ‌హంతి న‌రేంద్ర గిరి చివ‌రి కోరిక మేర‌కు బ‌ల్బీర్ గిరికి పీఠాన్ని అప్ప‌గించ‌నున్నారు. న‌రేంద్ర గిరి మ‌ర‌ణించిన 16వ రోజున‌ ఆ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 20వ తేదీన మ‌ఠంలో మ‌హంతి న‌రేంద్ర గిరి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆ కేసులో ఇద్ద‌రు సాధువుల‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.