Ajit Pawar: మేము ఎన్సీపీని వీడటానికి అసలు కారణం అదే.. అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు

అజిత్ పవార్ పార్టీని వీడిన తరువాత శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీలో చీలకకు దారితీసింది. అయితే, గత శుక్రవారం పూణె జిల్లా బారామతిలో శరద్ పవార్ విలేకరులతో మాట్లాడుతూ..

Ajit Pawar: మేము ఎన్సీపీని వీడటానికి అసలు కారణం అదే.. అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు

Deputy Chief Minister Ajit Pawar

Deputy Chief Minister Ajit Pawar: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులులేరని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో అజిత్ పవార్ పాల్గొని మాట్లాడారు. ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ను, ఆ పార్టీని వీడటానికి ప్రధాన కారణాన్ని వివరించారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే తమ వర్గం బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమి అయిన మహాయుతి కూటమిలో చేరడం జరిగిందని అజిత్ పవార్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికోసమే రాజకీయాల్లోనూ ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Ajit Pawar: అజిత్ పవార్ ముఖ్యమంత్రి కాబోతున్నారా? మొత్తానికి క్లారిటీ ఇచ్చేసిన దేవేంద్ర ఫడ్నవీస్

మహాయుతి కూటమిలో ఉన్నప్పటికీ అన్ని కులాలు, మతాల ప్రజలకు సమన్యాయం చేయడం మా కర్తవ్యమని అజిత్ పవార్ అన్నారు. రైతులకోసం ఎల్లవేళలా కృషి చేస్తానని, గతంలో నేను రాష్ట్రంలో జలవనరుల శాఖ మంత్రిగా  ఉన్నప్పుడు ఎన్నో పనులు చేశానని తెలిపారు. ఇదిలాఉంటే.. అజిత్ పవార్ ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి గత నెలలో షిండే నేతృత్వంలో శివసే, బీజేపీ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఆ తరువాత డిప్యూటీ సీఎంగానూ ప్రమాణ స్వీకారం చేశారు.

Ajit Pawar visits uncle Sharad : శరద్ పవార్‌కు అజిత్ పవార్ పరామర్శ

అజిత్ పవార్ పార్టీని వీడిన తరువాత శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీలో చీలకకు దారితీసింది. అయితే, గత శుక్రవారం పూణె జిల్లా బారామతిలో శరద్ పవార్ విలేకరులతో మాట్లాడుతూ.. అజిత్ పవార్ మా నేతే.. పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో విడిపోతే దాన్ని చీలిక అంటారు.. కానీ ఇక్కడ అలాంటిదేమీలేదని పవార్ అన్నారు. అయితే, కొద్దిగంటలకే శరద్ పవార్ మాట మార్చారు. అజిత్ పవార్ మా నాయకుడని నేను అనలేదని, సుప్రియ అజిత్‌ పవార్‌కు చెల్లెలు కాబట్టి అలా అని ఉండొచ్చునని, ఇందులో రాజకీయ అర్థాలు వెతకాల్సిన అవసరం లేదని శరద్ పవార్ అన్నారు. శరద్ పవార్ వ్యాఖ్యల నేపథ్యంలో అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు పమహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన్యత సంతరించుకున్నాయి.