ఇది నిజం: మలేరియా రహిత భారత్

  • Published By: venkaiahnaidu ,Published On : January 4, 2019 / 09:29 AM IST
ఇది నిజం: మలేరియా రహిత భారత్

మలేరియా కేసులు భారత్ లో గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా శుక్రవారం లోక్ సభకు తెలియజేశారు. 2016తో పోల్చి చూస్తే 2017లో మలేరియా కేసుల సంఖ్య 30లక్షలకు తగ్గిందని ఆయన తెలిపారు. మలేరియా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 2017లో 194 ఉండగా ఆ సంఖ్య బాగా తగ్గి 2018 సెప్టెంబర్ వరకు కేవలం 54 మంది చనిపోయినట్లు శుక్రవారం క్వచ్చన్ అవర్ లో నడ్డా లోక్ సభకు తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేసిన వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2018ను నడ్డా ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2016తో పోలిస్తే 2017లో భారత్ లో మలేరియా కేసులు24 శాతం తగ్గినట్లు ఆయన తెలిపారు. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే భారత్ మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని మంత్రి తెలిపారు.

ఈ విషయంలో కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుందని, మలేరియా కేసులను పూర్తిగా తగ్గించేందుకు వారికి తగిన సూచనలు చేస్తుందని,ఆ విధంగా మలేరియా మరణాలను బాగా తగ్గించగలిగినట్లు నడ్డా తెలిపారు. అయితే వైద్యఅధికారులు కనుక ిఇదేవిధంగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తే త్వరలోనే భారత్ మలేరియా రహిత భారత్ గా నిలుస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.