పీఎం మోడీపై మమతా రివర్స్ కౌంటర్.. కేంద్రమే అస్సలు పట్టించుకోలేదు

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం Mamata Banerjee పీఎం నరేంద్ర మోడీపై రివర్స్ కౌంటర్ వేశారు. కేంద్రం తమ రాష్ట్రానికి అందాల్సిన నిధులను ఇవ్వడం లేదని పశ్చిమ బెంగాల్ కు రాకుండా బ్లాక్ చేస్తున్నారని Mamata Banerjee ఆరోపించారు. తమ ప్రభుత్వం కేంద్రానికి సహకరిస్తుంటే ఇక నిధులు ఎలా అడ్డుకుంటామని ప్రశ్నించారు.
‘ఇది తప్పుదోవ పట్టించేందుకు వేస్తున్న ఎత్తుగడ. నిజమేంటంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. కో ఆపరేటింగ్ గా వ్యవహరిస్తుంది. కేంద్రమే అవి రాకుండా అడ్డుకుంటుంది. పశ్చిమ బెంగాల్ కోసం మోడీ ప్రభుత్వం అస్సలు ఏమీ చేయలేదు. ఇప్పటికీ.. 85వేల కోట్ల నిధులు రిలీజ్ చేయాల్సి ఉంది. అందులో జీఎస్టీ బకాయిలు రూ.8వేల కోట్ల వరకూ ఉన్నట్లు’ Mamata Banerjee చెప్పారు.
సగమే నిజం;
శుక్రవారం మోడీ.. రైతులను ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు. వారి సమస్యలకు పరిష్కారాన్ని తెలియజేయకుండా.. బహిరంగంగా పీఎం కిసాన్ యోజన ద్వారా రైతులకు సహాయం ఇస్తామని చెప్పకుండా తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారు. ఈ సగం నిజంతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు’ అని Mamata Banerjee రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
అంతకంటే ముందు ప్రధాని మోడీ.. రూ.18వేల కోట్ల రూపాయలను ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద 9కోట్ల మంది రైతులు లబ్ధి పొందేలా విడుదల చేసినట్లు చెప్పారు. కానీ, Mamata Banerjee ఆలోచనాతీరు వెస్ట్ బెంగాల్ ను పాడుచేసిందని.. రైతులకు పథకాలు రాకుండా అడ్డుకుంటున్న ఏకైక రాష్ట్రం వెస్ట్ బెంగాల్ అని అన్నారు.
కాసేపటి తర్వాత బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా.. సైతం Mamata Banerjeeపై విమర్శలు కురిపించారు. బెంగాల్ రాష్ట్రంలో ఇప్పటివరకూ 70లక్షల మంది రైతులు పీఎం కిసాన్ యోజన పథకం అందుకోలేకపోతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే, రానున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఎంసీలు కొత్త రైతు చట్టాలపై తమ శైలిలో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి బీజేపీ, టీఎంసీలు.