Mamata Banerjee : గ్రూపులు కడితే సహించను.. సొంత పార్టీ నేతకు పబ్లిక్‌గా దీదీ వార్నింగ్

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ప్రత్యర్థి ఎంతటి వారైనా అస్సలు కేర్ చేయరు. తాను అనుకున్నది చేస్తారు.

Mamata Banerjee : గ్రూపులు కడితే సహించను.. సొంత పార్టీ నేతకు పబ్లిక్‌గా దీదీ వార్నింగ్

Mamata Banerjee

Updated On : December 10, 2021 / 4:37 PM IST

Mamata Banerjee : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ప్రత్యర్థి ఎంతటి వారైనా అస్సలు కేర్ చేయరు. తాను అనుకున్నది చేస్తారు. చెప్పాలనుకున్నది చెబుతారు. డోంట్ కేర్ అనే స్వభావం ఆమెది. తప్పు చేస్తే అస్సలు సహించరు. తాజాగా సొంత పార్టీ నేతపైనే మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. గీత దాటితే వేటు తప్పదని పబ్లిక్ మీటింగ్ లో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.. సొంత పార్టీ మహిళా ఎంపీ మహువా మోయిత్రాకు వార్నింగ్‌ ఇచ్చారు మమతా బెనర్జీ. గ్రూపులు కడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. నదియా జిల్లాలో తృణమూల్‌ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న దీదీ.. పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. నదియా జిల్లాలో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మమత.. విభేదాలు పక్కనపెట్టి పార్టీ నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ఆధిపత్యం కోసం రచ్చకెక్కితే వేటు తప్పదని హెచ్చరించారు.

Covid Vaccination : కోవిడ్ టీకా ఏ సమయంలో వేయించుకోవాలో తెలుసా? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

క్రిష్ నగర్ లో పార్టీలో అంతర్గత విభేదాల గురించి మమత ప్రశ్నించారు. ఎంపీ మహువాను ఉద్దేశించి సీరియస్ అయ్యారు. ఎవరికి ఎవరు వ్యతిరేకంగా పని చేస్తున్నారనేది తనకు అవసరం లేదన్న దీదీ.. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరిని పోటీకి దింపాలనేది పార్టీ నిర్ణయిస్తుందని ఎంపీ మహువాతో తేల్చి చెప్పారు. ఒక వ్యక్తి శాశ్వతంగా ఒక స్థానంలో ఉంటాడని నమ్మకం లేదన్నారు. కాబట్టి ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కాగా, పార్టీ నదియా జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి ఇటీవలే ఆమెను తొలగించారు.

Bipin Rawat : బిపిన్‌ రావత్‌ జీవితాన్నే మార్చేసిన ‘అగ్గిపెట్టె’ సమాధానం

టీఎంసీ నాయకత్వంలోని ఓ వర్గం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఇటీవల పోస్టర్లు వెలిసినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పోలీసు విచారణలో తేలినట్టు మమత తెలిపారు. పథకం ప్రకారం మీడియాను తప్పుదారి పట్టించారని, దీని వెనుక ఎవరున్నారో తనకు తెలుసని అన్నారు. త్వరలో స్థానిక సంస్థలు జరగనున్నాయి. ఈ క్రమంలో మమత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.