41శాతం సీట్లు మహిళలకే కేటాయించిన మమతా…లిస్ట్ లో తెలుగు హీరోయిన్

లోక్ సభ ఎన్నికల యుద్ధానికి తృణముల్ కాంగ్రెస్ రెడీ అయింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని 42 ఎంపీ స్థానాలకు తమ పార్టీ తరపున పోటీచేసే వాళ్ల జాబితాను మంగళవారం(మార్చి-12,2019) సీఎం మమతా బెనర్జీ విడుదల చేశారు. మమత ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో అనేక ఆశక్తికర అంశాలు ఉన్నాయి. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా అంటూ 40.5 శాతం సీట్లను మహిళలకే కేటాయించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. ఇవాళ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో ఏడుగురు సిట్టింగ్ ఎంపీలకు మమత ఝలక్ ఇచ్చింది. ఏడుగురు సిట్టింగ్ ఎంపీలు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు.
సినీ హీరోయిన్లపై కూడా మమత ఎక్కువగా ఫోకస్ పెట్టింది. నాగార్జునకు హీరోగా నటించిన ‘మజ్ను’సినిమాతో పాటు కే.విశ్వనాథ్, సిరివెన్నెల సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించిన మున్ మున్ సేన్‌కు టిక్కెట్ కేటాయించింది. ప్రముఖ బెంగాలీ హీరోయిన్ మిమీ చక్రబర్తికి కూడా మమత టిక్కెట్ కేటాయించింది.బెంగాలీ వర్థమాన నటి నుస్రత్ జహాన్ కు కూడా మమత ఎంపీ టిక్కెట్ కేటాయించారు. మరోవైపు బెంగాలీ ఇండస్ట్రీలో హీరోలుగా వెలుగు వెలుగుతూ ప్రస్తుతం తృణముల్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న దేవ్ కు మరోసారి ఎంపీ టికెట్ ఖరారైంది. మరోవైపు ఒకప్పటి బెంగాలీ నటి శతాబ్దీరాయ్‌కు కూడా ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ కేటాయించారు.
తమ పార్టీ టికెట్లలో 33 శాతం మహిళలకు కేటాయిస్తున్నట్లు ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే ఏకంగా 41 శాతం సీట్లు మహిళలకు కేటాయించడం, అందులోనూ సినీ గ్లామర్ ను రంగంలోకి దించుతూ అందరినీ ఆశ్యర్యపరిచారు మమతా బెనర్జీ.
Trinamool Congress (TMC) releases list of 42 candidates contesting #LokSabhaElections2019 pic.twitter.com/ut1sCReYQB
— ANI (@ANI) March 12, 2019