ఆగ్రహంతో ఊగిపోతూ పెళ్లి కూతురి బంధువులపైకి కారు ఎక్కించిన యువకుడు.. తొమ్మిది మందికి గాయాలు

పెళ్లి వేడుకకు వచ్చిన యువకుడు.. వివాహ వేదిక వెలుపల బాణసంచా పేలుస్తున్నాడు.

ఆగ్రహంతో ఊగిపోతూ పెళ్లి కూతురి బంధువులపైకి కారు ఎక్కించిన యువకుడు.. తొమ్మిది మందికి గాయాలు

Crime

Updated On : November 18, 2024 / 3:49 PM IST

Crime News: రాజస్థాన్‌లో ఓ వివాహ వేడుకలో ఓ యువకుడు దారుణ ఘటనకు పాల్పడ్డాడు. తన కారుతో తొమ్మిది మందిపైకి దూసుకెళ్లాడు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లా, లడ్పూరా గ్రామంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. లడ్పూరాలో పెళ్లి వేడుకకు వచ్చిన యువకుడు.. వివాహ వేదిక వెలుపల బాణసంచా పేలుస్తున్నాడు. అదే సమయంలో వధువు సోదరుడితో అతడికి గొడవ మొదలైంది. పెళ్లికూతురి బంధువులతో ఆ యువకుడు వాగ్వాదానికి దిగాడు.

అనంతరం ఆగ్రహంతో ఊగిపోతూ కారులో కూర్చొని ఆ వాహనంతో పెళ్లికూతురు బంధువులపైకి దూసుకెళ్లాడు. దీంతో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని స్థానికులు జైపూర్‌లోని ఎస్‌ఎమ్‌ఎస్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఈ ఘటన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తాం: రాహుల్ గాంధీ