Madhya Pradesh : కరోనా నిబంధనలు ఉల్లంఘన, స్నానానికి వెళ్లి గుంజీలు తీశారు
రాజధాని భోపాల్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్ లోని నర్మద ఘాట్ కొంతమంది వ్యక్తులు స్నానాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

Mp Corona
Violate The Lockdown : కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రజలందరూ తప్పకుండా నిబంధనలు పాటించండి..అత్యవసరం అయితే..తప్ప బయటకు రావొద్దని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం సూచిస్తోంది. అయినా..కూడా కొంతమంది రోడ్ల మీదకు వచ్చి నిబంధనలకు తూట్లు పొడవడం, వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమౌతున్నారు. దీంతో వారికి ఫైన్ లు, ఇతర శిక్షలు వేస్తున్న సంగతి తెలిసిందే. అయినా..కొంతమందిలో మార్పులు రావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు వినూత్న శిక్షలు వేస్తున్నారు. నదిలో స్నానానికి వెళ్లిన స్థానికులను గుంజీలు తీయించారు పోలీసులు.
రాజధాని భోపాల్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్ లోని నర్మద ఘాట్ కొంతమంది వ్యక్తులు స్నానాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. చేతుల్లో లాఠీలు పట్టుకుని వారి చేత గుంజీలు తీయించారు. అక్కడనే ఉన్న కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
కరోనా కేసులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా నమోదయ్యాయి.
దీంతో ఆ రాష్ట్రం కఠిన నిబంధనలు విధించింది. తాజాగా..1,476 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. 60 మరణాలు సంభవించాయి. మొత్తంగా 7, 43, 550 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఖుర్గోన్ జిల్లాలో కర్ఫ్యూ అమల్లో ఉంది. జూన్ 01 వరకు రాష్ట్రంలో ఆంక్షలు అమల్లో కొనసాగనున్నాయి. అనంతరం కొన్నింటికి సడలింపులు ఇవ్వనున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
Read More : New IT rules: గూగుల్, ఫేస్‌బుక్ అప్‌డేట్.. ఐటీశాఖకు వివరాలు ఇస్తున్నాయి