Covid-19 Restrictions : కోవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగించిన కేంద్రం
కోవిడ్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన ఆంక్షలను నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్లు, అలాగే 5 శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు

Covid (1) (1)
Covid-19 Restrictions కోవిడ్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన ఆంక్షలను నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్లు, అలాగే 5 శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో ప్రజలు గుమిగూడే ఎటువంటి కార్యక్రమాలకు అనుమతులు లేవని కేంద్రం తన ఉత్తర్వుల్లో తెలిపింది.
దేశంలో కరోనా కేసులు చాలా వరకూ తగ్గుముఖం పట్టినప్పటికీ కొందరు నిపుణులు ఇప్పటికీ కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని, పండుగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు. దీనికితోడు తాజాగా మరో కొత్త కరోనా వేరియంట్ కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలో దేశంలో కరోనా నిబంధనలు మరికొన్నిరోజులు పొడిగించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.
కోవిడ్ ఆంక్షలను నవంబరు 30 వరకు పొడిగిస్తూ గురువారం కేంద్రహోంశాఖ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా… అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు.. ఆయా జిల్లాల్లోని అధికారులకు కరోనా వైరస్ కట్టడిపై దిశానిర్దేశం చేయాలని అజయ్ కుమార్ భల్లా సూచించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిరవధికంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు.
పండగ సీజన్‌లో వైరస్ వ్యాప్తిని టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, బిహేవియర్ అనే ఐదు విభాగాల ద్వారా కట్టడి చేయాలన్నారు. పాజిటివిటీ రేటు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు, ఐసీయూ పడకల సామర్థ్యం.. తదితర అంశాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. దేశంలో రోజువారీ కేసులు, వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య తగ్గుతున్నా.. కొన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ విజృంభణ సవాల్‌గా మారిందని అజయ్ కుమార్ భల్లా తెలిపారు.
కాగా,దేశంలో ఇవాళ కొత్తగా 16,156 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 3,42,31,809కు చేరింది. మరోవైపు ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,04,04,99,873 కి చేరింది. దేశంలో ప్రస్తుతం కోవిడ్ రికవరీ రేటు 98.20శాతంగా ఉంది.
ALSO READ Covid Variant AY.4.2 : 5 రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు..థర్డ్ వేవ్ సంకేతమా!