ఆపరేషన్ యుద్ధ్ : 12 యుద్ధ విమానాలు, 1000 కేజీల బాంబులు.. 300 మంది హతం

  • Published By: vamsi ,Published On : February 26, 2019 / 04:33 AM IST
ఆపరేషన్ యుద్ధ్ : 12 యుద్ధ విమానాలు, 1000 కేజీల బాంబులు.. 300 మంది హతం

Updated On : February 26, 2019 / 4:33 AM IST

మాటలు చేతల వరకు వచ్చాయి. కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ పై ఏ మాత్రం సానుభూతి చూపించలేదు భారత్. మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చిన మోడీ.. అన్నంత పనీ చేశారు. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి తీవ్రవాద శిబిరాలపై విచుకుపడింది భారత్ వాయుసేన. 
Read Also : మిరాజ్ యుద్ధ విమానాల దాడి.. లైవ్ వీడియో చూడండి

ఆపరేషన్ యుద్ధ్ ఎలా జరిగింది :
– మొత్తం 12 మిరాజ్ 2000 యుద్ధవిమానాలు పాల్గొన్నాయి.
– 28 మంది పైలట్లు ఈ ఆపరేషన్ లో భాగంగా పాక్ భూభాగంలోకి ప్రవేశించారు.
– వెయ్యి కేజీల బాంబులను తీవ్రవాద శిబిరాలు టార్గెట్ గా పేల్చారు.
– శాటిలైట్ ఆధారంగా లైన్ ఆఫ్ కంట్రోల్ లో ఉన్న తీవ్రవాద శిబిరాలను గుర్తించి.. గురిచూసి బాంబులు వదిలారు
– వెయ్యి కేజీల బాంబులతో లైన్ ఆఫ్ కంట్రోల్ దద్ధరిల్లింది
– తీవ్రవాద శిబిరాలుగా అనుమానిస్తున్న అన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
– ఆయా ఉగ్రవాద శిబిరాల్లో తలదాచుకుంటున్న 300 మంది తీవ్రవాదులు హతం అయినట్లు అంచనా
– ఫిబ్రవరి 26వ తేదీ అర్థరాత్రి తర్వాత తెల్లవారుజామున 3.30గంటలకు జరిగిన ఈ ఆపరేషన్ పూర్తిగా విజయవంతం అయినట్లు ప్రకటించింది భారత్ ఆర్మీ
Read Also :భారత్ సర్జికల్ ఎటాక్స్ : ఒక్కరు కూడా చనిపోలేదన్న పాక్

పుల్వామాలో ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న తీవ్రవాదులకు ఇది గుణపాఠం అని స్పష్టం చేసింది కేంద్రం. భారత సరిహద్దుల్లోనే కాదు.. పాక్ దేశంలో ఏ మూలన తీవ్రవాదులు ఉన్నా వదిలేది లేదని భారత్ ప్రకటించింది.
Read Also : బోర్డర్ లో హై ఎలర్ట్ : ప్రధాని మోడీ ఎమర్జన్సీ మీటింగ్