Moderna Refuses : విదేశీ టీకా సంస్థలు షాక్ ఇస్తాయా ? గ్లోబల్ టెండర్లకు స్పందన వస్తుందా ?

కరోనా వ్యాక్సిన్‌ల కోసం గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానిస్తోన్న రాష్ట్రాలకు విదేశీ టీకా సంస్థలు షాక్‌ ఇవ్వనున్నాయా? అసలు రాష్ట్రాలతో చర్చలు జరిపేందుకు కూడా టీకా కంపెనీలు సిద్ధంగా లేవా? కేవలం కేంద్రంతోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాయా? పంజాబ్‌ ప్రభుత్వ విజ్ఞప్తిని మోడెర్నా తిరస్కరించడం దేనికి సంకేతం?

Moderna Refuses : విదేశీ టీకా సంస్థలు షాక్ ఇస్తాయా ? గ్లోబల్ టెండర్లకు స్పందన వస్తుందా ?

Moderna Refuses To Sell Vaccines Directly To States

Updated On : May 24, 2021 / 3:12 PM IST

Vaccines Directly to States : కరోనా వ్యాక్సిన్‌ల కోసం గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానిస్తోన్న రాష్ట్రాలకు విదేశీ టీకా సంస్థలు షాక్‌ ఇవ్వనున్నాయా? అసలు రాష్ట్రాలతో చర్చలు జరిపేందుకు కూడా టీకా కంపెనీలు సిద్ధంగా లేవా? కేవలం కేంద్రంతోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాయా? పంజాబ్‌ ప్రభుత్వ విజ్ఞప్తిని మోడెర్నా తిరస్కరించడం దేనికి సంకేతం? వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు చాలా రాష్ట్రాలు గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానిస్తున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు నేరుగా విదేశీ వ్యాక్సిన్‌ కంపెనీలతో చర్చలు కూడా జరుపుతున్నాయి. అయితే టీకా సంస్థలు మాత్రం రాష్ట్రాలతో డీల్ కుదుర్చుకునేందుకు ఇష్టం లేనట్లు వ్యవహరిస్తున్నాయి. నేరుగా కేంద్రంతోనే చర్చలు జరుపుతామని తెగేసి చెబుతున్నాయి.

కరోనా వ్యాక్సిన్‌ను తమ రాష్ట్రానికి విక్రయించాలన్న పంజాబ్‌ ప్రభుత్వ విజ్ఞప్తిని అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ తిరస్కరించింది. నేరుగా కేంద్ర ప్రభుత్వంతోనే టీకా విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనేది తమ విధాన నిర్ణయమని స్పష్టం చేసింది. మోడెర్నా, ఫైజర్‌, స్పుత్నిక్‌-వి, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తదితర టీకా తయారీ సంస్థల నుంచి నేరుగా డోసులు కొనేందుకు గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించాలని భావిస్తోన్న పంజాబ్‌ సర్కార్‌కు స్టార్టింగ్‌లోనే మోడెర్నా షాక్‌ ఇచ్చింది.

వ్యాక్సిన్‌ కోసం దేశంలోని 10కిపైగా రాష్ట్రాలు గ్లోబల్‌ టెండర్లు పిలిచాయి. కానీ దీనికి ఎంతవరకు స్పందన వస్తుందనేది ఇప్పుడు అనుమానంగా కనిపిస్తోంది. వ్యాక్సిన్‌ కంపెనీలు నేషన్‌ టు నేషన్‌ చర్చలు జరపడానికి మొగ్గుచూపుతున్నాయి. రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవాడానికి సిద్ధంగా లేవు. తమ విధానం ప్రకారం తాము నేరుగా భారత ప్రభుత్వంతో మాత్రమే లావాదేవీలు జరుపుతామని, రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ, ప్రైవేటు పార్టీలతో కానీ లావాదేవీలు జరపమని వ్యాక్సిన్‌ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో గ్లోబల్‌ టెండర్లు పిలిచిన రాష్ట్రాలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. పంజాబ్‌ పరిస్థితే తమకు వస్తుందేమోనని అయోమయంలో పడ్డాయి.

అటు ఫైజర్‌ కూడా మోడెర్నాలాగానే ఆలోచిస్తోంది. అసలు రాష్ట్రలతో చర్చలు జరపడానికి ఫైజర్‌ ఏ మాత్రం ఇష్టం లేనట్లు తెలుస్తోంది. కేంద్రంతో ఫైజర్‌ జరపుతున్న చర్చలు ఇప్పటిదాకా ఓ కొలిక్కి రాలేదు. ఇక రాష్ట్రాల గురించి ఆలోచించే పరిస్థితులో ఫైజర్‌ లేదు. టీకా దుష్ప్రభావంతో మరణించిన వారికి ఇచ్చే పరిహారం విషయంలో తమకు కేంద్ర ప్రభుత్వం నుంచే భద్రత కల్పించాలని ఫైజర్ డిమాండ్ చేస్తోంది. అయితే, దేశంలో ఇప్పటిదాకా ఏ సంస్థకూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి న్యాయపరమైన భద్రతను ఇవ్వలేదు.

ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే…వ్యాక్సిన్‌ల కొరతతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు తిప్పలు తప్పేలాలేవు. దేశంలో ప్రస్తుతం రెండే కంపెనీలు- సీరం, భారత్‌ బయోటెక్‌ టీకా ఉత్పత్తి చేస్తున్నాయి. వాటితో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మూడు తప్ప మరో కంపెనీ గ్లోబల్‌ టెండర్లలో పాల్గొనే అవకాశం లేదు. దీంతో పాటు మోడర్నా, ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీలు కూడా రాష్ట్రాలతో చర్చలు జరిపేందుకు ఇష్టం లేనట్లు ఉండడంతో గ్లోబల్‌ టెండర్లను పిలిచిన రాష్ట్రాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

Read More : Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు ?